Site icon vidhaatha

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఆనందంగా ఈ రాశివారి వైవాహిక జీవితం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు ఉంటాయి. ఒక వ్యవహారంలో డబ్భు చేతికి అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం, శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుభవజ్ఞుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాల కోసం గట్టి ప్రయత్నం చేయాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. విశేషమైన ధనయోగాలున్నాయి. నూతన వాహన యోగం, పదవీ యోగం ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి నడుచుకోవాలి. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు భారీ లాభాలు ఉండవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి తీవ్రమైన కృషితోనే ఆశించిన ఫలితాలు పొందగలరు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనువైన సమయం. కీలక చర్చలలో మీ వాగ్ధాటికి ప్రశంసలు అందుకుంటారు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా, వృత్తి పరంగా ఆశించిన ప్రయోజనాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. సామాజిక పరపతి బలాన్నిస్తుంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరగవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే తీవ్రంగా కృషి చేయాలి. కీలక వ్యవహారాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Exit mobile version