Site icon vidhaatha

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని వైపులా నుంచి శుభ సంకేతాలున్నాయి. వృత్తిపరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. వ్యాపారులకు పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే ఆటంకాలు ఉండవు. కుటుంబ వ్యవహారాల్లో దూకుడు తగదు. సహనంతో వ్యవహరించాలి. ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో ప్రమాదముంది కాబట్టి వాయిదా వేస్తే మంచిది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు దీర్ఘకాలంలో మెరుగైన ప్రయోజనాలనిస్తాయి. నూతన వస్త్ర వాహన లాభాలున్నాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం అనుకూలించడం లేదు. చేపట్టిన పనుల్లో ఆచి తూచి నడుచుకోవాలి. కీలకమైన వ్యవహారాల్లో పురోగతి లోపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదాన్ని పక్కన పెట్టండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ కుటుంబంలో సంతోషం నింపుతుంది. బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రయత్నపూర్వక ధనలాభాలుంటాయి. వ్యాపారంలో అదృష్టయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికలాభాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రద్ధ, ఉత్సాహం లోపించకుండా చూసుకోండి. ఎవరితోనూ వివాదాలకు పోవద్దు. ఆర్థికంగా మిశ్రమ సమయం. ఖర్చులు పెరిగే సూచన ఉంది. కీలక వ్యవహారాల్లో ప్రయత్నలోపం లేకుండా జాగ్రత్త పడండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన బాధ్యతలు పెరుగుతాయి. అన్ని పనులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారి ప్రయత్నాలు ఫలించవు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో ఒక కీలక పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సందర్భానుసారం నడుచుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. చేపట్టిన పనుల్లో పట్టుదల, ఏకాగ్రత లోపించకుండా చూసుకోండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. భోజన సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు.

Exit mobile version