మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలతో నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఏ పని మీద ఆసక్తి లేకుండా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగులకు ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనధాన్య లాభాలున్నాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలగవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో ఆటంకాలు అధిగమించి వృత్తిపరంగా శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. నూతన వస్తువాహనాలు కొంటారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలంతో తలపెట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రతిభకు ప్రశంసలు, పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిసారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఏకాగ్రత, పట్టుదల అవసరం. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సోదరులతోనూ, రక్త సంబంధీకులతోనూ అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థిక లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలు, కలహాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్త పడండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. సమాజంలో పలుకుబడి, పరపతి పెరుగుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొదలు పెట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. సామాజిక, దైవ కార్యకలాపాల పైన అధికంగా ఖర్చు చేస్తారు. ఓ వ్యవహారంలో డబ్బు నష్టపోవడం జరుగుతుంది. సన్నిహితులు, ప్రియమైనవారితో కలహాలు ఏర్పడవచ్చు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగ మార్పుకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠ, ప్రజాదరణ పెరుగుతాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మనః సౌఖ్యం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు తమ పై అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారులు, సేవారంగం వారికి శుభ ఫలితాలు ఉంటాయి.