Site icon vidhaatha

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ శక్తివంతంగా ఉంటారు కాబట్టి అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్ధికంగా లాభ పడవచ్చు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి పరీక్షాసమయం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకుని నిగ్రహం పాటించాలి. చేపట్టిన పనుల్లో ఆచరణాత్మకంగా నడుచుకోవాలి. కుటుంబ విషయాల్లో సందర్భానుసారం నడుచుకోవడం మంచిది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు తగ్గించుకుంటే మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్ధిక వ్యవహారాల్లో మొహమాటాలకు పోతే చిక్కుల్లో పడతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పని ప్రదేశంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలు నుంచి దూరంగా ఉండాలి. ధ్యానం, ఆధ్యాత్మికతతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తులు వృద్ధి చేస్తారు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు, దూకుడు కారణంగా వృత్తిలో మంచి అవకాశాలు కోల్పోతారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ముందు చూపు లేకపోవడంతో ఖర్చులు పెరుగుతాయి. వివాదాలు, సమస్యలకు దూరంగా ఉండడం అవసరం.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వయంకృషితో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వ్యతిరేక పరిస్థితులు చుట్టుముడతాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఆత్మీయులతో మనస్పర్థలు ఏర్పడుతాయి. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఒక శుభవార్త వింటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. సమాజంలో మీ స్థాయి, వృత్తిలో హోదా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక పనిలో పురోగతి సాధిస్తారు. ఇతరులను బాధపెట్టేలా ప్రవర్తించకండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

Exit mobile version