మేషం (Aries)
ఈ రాశివారు తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతారు. అన్నివిధాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఉద్యోగ వ్యాపారాలలో వ్యతిరేక పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది కాబట్టి చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి. ఆస్తి , భూతగాదాలు ఉండవచ్చు. ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయవద్దు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
వృషభం (Taurus)
వృత్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. వృత్తి పరంగా ఓటములు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే సమస్యలు సునాయాసంగా అధిగమించవచ్చు. కుటుంబ కలహాలు ఏర్పడకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడపడం మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆర్థికపరంగా కొన్ని చిక్కులు ఏర్పడతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సహనం కోల్పోకండి. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచండి. మాటను అదుపులో ఉంచుకుంటూ వీలైనంత వరకు మౌనంగా ఉండడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
తుల (Libra)
తులారాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులు తమ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సమనవ్యయం ఉంటే సమస్యలు తొలగిపోతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల మాటలు వింటే మంచి జరుగుతుంది. విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్, స్థిరాస్తి రంగాల వారికి పెట్టుబడులు, ఆదాయాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు భారీ లాభాలను చూడబోతున్నారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో విజయాన్ని చూస్తారు. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఆర్థిక యోగాలున్నాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఇతరుల సహకారం ఉంటుంది. శుభవార్తలు నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. రుణభారం తగ్గుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు.