మేషం
మేషరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా, పై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు లాభాలబాటలో నడుస్తాయి. వృత్తి పరమైన పనుల నిమిత్తం కొత్త ప్రదేశాలలో పర్యటిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులు నూతన పెట్టుబడులు సేకరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. తీర్థయాత్రలు, దైవ దర్శనం ద్వారా ఆధ్యాత్మికతను బలోపేతం చేసుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్నింటా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాలు, మెడికల్ చెకప్స్ వాయిదా వేయండి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. మితిమీరిన కోపంతో కలహాలు ఏర్పడే ప్రమాదముంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. అవసరానికి సహాయం అందుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండవచ్చు. అనారోగా సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహం
సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సహచరుల సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వివాదాలకు దారితీసే చర్చలకు దూరంగా ఉంటే మంచిది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
తుల
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో లాభపడతారు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషం నింపుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు అందుకుంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. జీవిత భాగస్వామితో కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ప్రమాదాలకు దూరంగా ఉంటే మంచిది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. మీ వాక్చాతుర్య నైపుణ్యంతో సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. భూములు, ఇల్లు కొనుగోలు విషయాల్లో పురోగతి ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. మొహమాటానికి పోయి చిక్కులో పడే పరిస్థితులు ఉండవచ్చు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనుకోని ఆపదలు ఏర్పడే అవకాశముంది. మనోధైర్యం తగ్గకుండా చూసుకోండి.