Site icon vidhaatha

Horoscope | మార్చి 8 రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ఆర్థిక లాభాలు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితో విదేశీ పర్యటనకు ప్రణాళికలు వేస్తారు. బంధువులతో వాదోపవాదాలలో మౌనంగా ఉండడం మంచిది. ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెరుగుతాయి. దృఢమైన సంకల్పంతో ముందుకెళ్లి సత్ఫలితాలు పొందుతారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతిపనిలోనూ ఆచి తూచి అడుగేయాలి. తొందరపాటు పనికిరాదు. సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తే చేపట్టిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. మొండి పట్టుదలకు పోకుండా రాజీ ధోరణి పాటిస్తే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చంచల బుద్ధి విడిచి స్థిరమైన ఆలోచనలతో ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుంది. ఆర్థికపరంగా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించి, పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ప్రియమైన వారు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు ఏర్పడకుండా చూసుకోండి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు నష్టం జరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే పనులు చేయవద్దు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహతుల సహకారంతో కీలకమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు వచ్చే సూచన ఉంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. గొప్ప అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త వహించండి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదల సంతోషం కలిగిస్తుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలమైన సమయం. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. అనారోగ్య సమస్యల చికిత్స కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. దూరప్రాంతాలకు ప్రయాణం ఉండే అవకాశాలున్నాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతత దూరం చేస్తాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చెడు వ్యక్తుల సాంగత్యంతో సమస్యల్లో చిక్కుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలుగుతుంది. మంచి ప్రణాళికతో సత్ఫలితాలు ఉంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రోజులుగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

Exit mobile version