Site icon vidhaatha

May 11th Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని అదృష్టం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు అన్నివిధాలా సంతోషకరమైనది. విశేషమైన ఆర్థిక లాభాలున్నాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో మీరు రచించే ప్రణాళికలు సత్ఫలితాన్నిస్తాయి.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఒడిదొడుకులు మీకు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. ఉద్యోగంలో పనిభారం, శ్రమ పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైన పనులకు ఈ రోజు శుభకరమైన రోజు కాదు. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత కొరవడుతోంది. కుటుంబసభ్యులతో గొడవపడతారు. ఆర్థిక నష్టం కూడా సంభవించవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో అకారణ కలహాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. కోపాన్ని వీడి ప్రశాంతంగా ఉండడం అవసరం. చంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ చమత్కారపు మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఊహించని అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్లక్ష్యం కారణంగా మాట పడాల్సి వస్తుంది. అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. నిరాశ నిస్పృహలకు లోనుకావద్దు.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాబట్టుతారు. స్వయంకృషితో ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. మీ కలలన్ని సాకారం అవుతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిపరంగా ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో, విందు వినోదాలలో పాల్గొంటారు.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. వ్యాపారాభివృద్ధి నిరాశ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అనుకోకుండా ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలక విషయంలో ముందడుగు వేస్తారు. ఒత్తిడి దరిచేరనియకండి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.

Exit mobile version