Site icon vidhaatha

Horoscope | మే 13, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అపారమైన దైవబలం అండగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోడానికి సరైన సమయం. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరమైన లాభాలు మెండుగా ఉంటాయి. ఉగ్యోగంలో మంచి గుర్తింపు సాధిస్తారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పట్టుదల, కృషితో కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. బంధుమిత్రుల సహాయసహకారాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్ధిక లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. స్వయంకృషితో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలున్నా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడంతో ఉల్లాసంగా ఉంటారు. వదంతులు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్ధిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల వ్యవహారాల్లో వేసే ప్రతి అడుగు పరిశీలించుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. ఓ ఘటన విచారం కలిగిస్తుంది. ఆటంకాలు ఎదురైనా ప్రయత్నాలు ఆపవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో లోతైన పరిశీలన అవసరం. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. మీ మొండి వైఖరి మీతోపాటు మిగతా వారినీ కష్టాల పాలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. మీ తెలివితేటలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. మీకు అప్పజెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఆత్మీయులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. అవివాహితులకు కళ్యాణం జరగవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలం.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు సాధిస్తారు. మీ మంచి మనసును అందరూ గుర్తిస్తారు. చేపట్టిన పనులు సులభంగా, సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఒక పెద్ద విజయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు కనువిప్పు కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. సహోద్యోగుల సహకారంతో పనిలో ఆటంకాలు అధిగమిస్తారు. కోపావేశాలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

Exit mobile version