మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. మాతృవర్గం నుంచి ఆర్థిక లబ్ది ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలం.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్థులకు నూతన అవకాశాలు అందుకుంటారు. ధనలాభాలు ఉంటాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతాయి. ఇంట్లో గొడవలు కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు అశాంతి కలిగిస్తాయి. మీ కోపావేశాలతో, దూకుడు స్వభావంతో పరువుపోయే సందర్భాలు ఏర్పడవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దూరదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. పరువు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. శారీరక శ్రమ, పని ఒత్తిడి పెరుగుతాయి. మనోధైర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండవచ్చు. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంతో ఉంటే మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. సహనంతో ఉండడం మంచిది. ఆర్థికంగా కఠిన పరిస్థితులు ఉంటాయి. సంతానం పురోగతి ఆందోళన కలిగిస్తుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనల కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. భావోద్వేగాలు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మనస్పర్థలు, ఆభిప్రాయ భేదాలు చికాకు కలిగిస్తాయి. నీటిగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. రక్త సంబంధీకులతో జరిపే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ఉంటే విజయం సిద్ధిస్తుంది. మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. ఏ పని మొదలు పెట్టినా వేగంగా పూర్తవుతుంది. మీ వాక్చాతుర్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. ముఖ్యమైన సమావేశాల్లో మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. సంతానంకు సంబంధించి శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయం భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తుంది. సామాజిక కార్యక్రమాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్తారు.