Site icon vidhaatha

Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి భూగృహ లాభాలు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతుతో ఆటంకాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోపం అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ధన లాభం చేకూరుతాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విందువినోదాల్లో పాల్గొంటారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటే మంచిది. కోపం అదుపులో ఉంచుకోవాలి. పొరబాటుగా మాట్లాడితే వివాదాలు, అపార్థాలు రావచ్చు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది. వ్యాపారంలో ఆర్ధిక పరమైన లబ్ధి ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. అన్ని పనులూ సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి.మనోధైర్యంతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకంగా మారుతాయి. బుద్ధిబలంతో నడుచుకుంటే వృత్తిలో సమస్యలు తొలగిపోతాయి. పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శత్రువులపై ఓ కన్నేసి ఉంచండి. ఆర్ధిక సమస్యలు రాకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ పరుషమైన మాటతీరు కారణంగా కుటుంబ సభ్యులతో, సహచరులతో అనవసర కలహాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడి తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా, సంతోషంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం, దైవానుగ్రహం, ప్రశంసలు, గౌరవం, కీర్తి లభిస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు, పెట్టుబడులు ఆనందం కలిగిస్తాయి. భూగృహ లాభాలున్నాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు మీ అనారోగ్యం మీ ఆనందాన్ని హరిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని సంఘటనల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. చంచల బుద్ధి కారణంగా నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పని ప్రదేశంలో వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్ధిక లాభాలు ఉంటాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. సంతానం పురోగతి సంతోషం కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే కష్టపడి పనిచెయ్యాలి. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.

Exit mobile version