మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సత్ప్రవర్తనతో, మంచి ఆలోచన విధానంతో అందరి ప్రశంసలు పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లారు. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. లాభాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గిస్తే మంచిది. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడి, ఉద్రిక్తత కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వాదనలు ఘర్షణల్లో మౌనంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటిని అధిగమిస్తారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక పని వత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తలపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తారు. బంధు మిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు పట్టుదలతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. సంపద వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తినిపుణులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఓ సంఘటన ఒత్తిడి కలిగిస్తుంది. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో, నూతనోత్సాహంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మేధోపరమైన చర్చలలో పాల్గొని మీ మాటతీరుతో అందరినీ మెప్పిస్తారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సృజనాత్మకంగా అలోచించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు.