Site icon vidhaatha

May 9th Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశి ఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ సుదీర్ఘకాలపు శ్రమకు సత్ఫలితాలు అందుకుంటారు. పరోపకారం, ధార్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ సమర్ధతకు, ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ సమయం నడుస్తోంది. బుద్ధిబలంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా జాగ్రత్త పడండి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు ఉంటాయి. ఆస్తులు వృద్ధి చేస్తారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతికూల ఆలోచనలు తావు లేకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం సామాన్యంగా ఉన్నప్పటికీ శ్రద్ధాసక్తులతో పనిచేస్తే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సన్నిహితుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి. ధైర్యంతో ముందడుగు వేస్తే ప్రయోజనం ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆచి తూచి నడుచుకోవాలి. అశ్రధ్ధతో ఖర్చులు పెరిగే ప్రమాదముంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడకండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన సమయం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. నిరంతర కృషితో భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలకమైన సమావేశాలు, చర్చలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారులు కృషితో ఉన్నతశిఖరాలు చేరుకుంటారు. మంచి లాభాలు గడిస్తారు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తిచేస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఉత్సాహంగా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారిపట్ల జాగ్రత్తగా ఉండండి.

Exit mobile version