Site icon vidhaatha

Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఎలాంటి ప్రతికూలతలు లేని మంచి రోజును బంధు మిత్రులతో సంతృప్తికరంగా ఆస్వాదించండి. ఈ రాశివారిని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వృతి పరంగా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ఉన్నతమైన ఆలోచనలతో, మంచి మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. పరోపకార గుణంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ముఖ్యమైన సమావేశాలలో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం, ప్రయత్నలోపం తగ్గకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. సోదర వర్గం నుంచి లబ్ధి పొందుతారు. స్నేహితుల ద్వారా ఆర్థికంగా లాభపడతారు. చేపట్టిన పనులన్నీ సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మనోబలంతో అనుకున్న కార్యాలు నెరవేర్చుకుంటారు. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. కుటుంబంతో అనుబంధం బలోపేతం అవుతుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా మాట అదుపులో పెట్టుకోండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు తమ తమ రంగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వివాదాస్పద పరిస్థితుల్లో చిక్కుకుంటారు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు, ఒత్తిడి ఉండే అవకాశం వుంది. అనుకున్న పనులు కాకపోవడంతో అసహనం, కోపం, చిరాకు పెరుగుతాయి. మీ మాటతీరుతో ఇతరులు భాధపడకుండా చూసుకోండి. ఇంట్లో శుభకార్యం మూలంగా ఖర్చులు పెరగవచ్చు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ప్రారంభిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకమైన రోజు. ఖర్చులు పెరుగుతాయి.

Exit mobile version