Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి బంధువులతో విభేదాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తే ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారాల్లో అనవసర చర్చలు నివారించండి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.మనోబలంతో చేపట్టిన పనులు పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. చక్కటి ప్రణాళికతో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో క్లిష్టమైన సమస్యలు సునాయాసంగా పరిష్కరిస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ఆశయాలు నెరవేరుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు కోసం తీవ్రంగా శ్రమించాలి. ప్రారంభించిన పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో మొండి పట్టుదల వీడి రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో విభేదాలకు ఆస్కారం ఉంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సన్నిహితులతో చేసే ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఖర్చులు అదుపు చేయడం అవసరం. మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలకు దూరంగా ఉండండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముందుచూపుతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధురస్మృతులు నెమరువేసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే అనేక సంఘటనలు ఎదురవుతాయి. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో మీ నిర్ణయం కీలకంగా మారుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనులు విజయవంతం అవుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో సహనం కోల్పోకుండా జాగ్రత్త వహించండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. పిత్రార్జితం ద్వారా లాభపడతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరగడం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉంటుంది. అర్థలాభం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు.