Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. సినీ, మీడియా రంగాలలో పనిచేసేవారు అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా సాగిపోతుంది. కుటుంబంలో వివాహ వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతమైన యోగం ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంటుంది. ఆర్థిక పరమైన ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో చెప్పుకోతగ్గ పురోగతి ఉండదు. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థిక పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వయంకృషిని నమ్ము కుని ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ పెద్ద ఇబ్బంది కలిగించవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన వ్యయాలకు చాలా అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ప్రయత్నంతోనే సులభంగా విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల సహకారం, అధికారుల అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారంలో క్రమంగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు నివారించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పట్టుదల, ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనయోగాలున్నాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. చట్టపరమైన డాక్యుమెంట్లు, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోవద్దు. బంధువులతో మనస్పర్థలు విచారం కలిగిస్తాయి. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శాంతంగా వ్యహరించాలి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనవసర చర్చలు, వాదనలు దూరంగా ఉంటే మంచిది. కుటుంబంలో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగితే ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక వ్యవహారాల్లో విజయం సాధించాలంటే మానవ ప్రయత్నం బలంగా ఉండాలి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.

Latest News