ఒకప్పుడు దక్షిణాది చిత్రాలలో బిజీ హీరోయిన్ గా కొనసాగిన నటి నమిత..అంతే వేగంగా తెరమరుగైపోయింది. విపరీతంగా లావెక్కిపోయి బొద్దుగుమ్మగా మారిపోయిన ఈ అమ్మడు పెళ్లి తర్వతా సినిమాలకు దూరమైంది.తాజాగా బమ్ చుక్ బమ్ అంటూ జిమ్ కసరత్తులు చేస్తున్న నమిత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లుగా కనిపించి అభిమానులను అశ్చర్యపరిచగా..ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లావెక్కిపోయిన శరీరంతో సినీ అవకాశాలు చేజార్చుకున్న ఒకప్పటి ఈ గ్లామర్ స్టార్ ఇప్పుడు.. గతానికి భిన్నంగా సన్నబడిన శరీరంతో జిమ్ కసరత్తులతో చెమటోడుస్తూ వీడియోలో సందడి చేయడంతో ఆవిడ ఈవిడేనా అంటూ నెటిజన్లు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన హీరోయిన్ నమిత (నమిత వాంక్వాలా) 1998లో మిస్ సూరత్, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగో స్థానం సాధించారు. హీరో విక్టరి వెంకటేశ్ కు జోడిగా ‘జెమిని’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నమిత తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘సొంతం’, ‘ఒక రాజు ఒక రాణి’, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, ప్రభాస్ బిల్లా వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాతా బొద్దుగుమ్మగా మారిపోయిన నమిత 2010లో వచ్చిన సింహా చిత్రంలో బాలయ్యతో ఆడిపాడి మెప్పించారు. ఆ తర్వాతా ఐటమ్ సాంగ్స్ లలోనూ సందడి చేశారు. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి 2022 ఆగస్టు 19న ఇద్దరు మగ కవలలు జన్మిచ్చారు. బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్, రాజకీయాలతో బిజీగా ఉన్న నమిత తన ఫిట్నెస్, గ్లామర్ ను పరిరక్షించుకోవడంలో మాత్రం తగ్గేదేలేదంటున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ అవుతున్న ఫిట్నెస్ వీడియో!#Namitha #ViralVideo #Tollywood #Kollywood #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official pic.twitter.com/b3QJnYUfTY
— Tupaki (@tupaki_official) July 17, 2026