Site icon vidhaatha

Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ‌యోగం..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి. బంధుమిత్రులతో కులాసాగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరిగే సూచన ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడానికి అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. ముఖ్యమైన ప్రయాణాలు, నిర్ణయాలు వాయిదా వేయండి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. అన్ని రంగాల వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో పనిచేసి ఆశయాలను సఫలం చేసుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలహాలు ఉండవచ్చు. వ్యక్తిగతంగా మీకు చెడ్డ పేరు తెచ్చే పనులు మానుకోండి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి జయించడానికి యోగా, ధ్యానం చేస్తే మంచిది. కుటుంబ సభ్యుల మాటలు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. వృత్తినిపుణులకు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ముఖ్యమైన సమావేశాల్లో, చర్చల్లో, మీ మాటతీరు ఇతరులను ప్రభావితం చేయగలదు. ఆర్థిక లాభాలు ఉంటాయి. నచ్చిన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రాణ స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వనరులు, ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోండి. మీ మనోబలమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ ప్రశాంతతకు విఘాతం కలిగే పనులు చేయవద్దు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే కఠిన శ్రమ అవసరం. వృత్తి ఉద్యోగాలలో సవాళ్లు, ఆర్థిక నష్టాలతో నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆచి తూచి నడుచుకోవాలి. అలోచించి ఖర్చు పెట్టాలి. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్ ఆలోచనలతో ఒకింత ఒత్తిడికి గురవుతారు. ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. కీలకమైన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకోవచ్చు. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. విమర్శకుల మాటలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వృథా ప్రయాణాలు ఉండవచ్చు.

Exit mobile version