మేషం
మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. శుభకార్యాలలో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పం, సాహసంతో పనిచేసి వృత్తి వ్యాపారాల్లో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. అన్ని రంగాల వారికి సర్వత్రా విజయమే! పితృ సంబంధమైన ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలు పుష్కలంగా ఉంటాయి. పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను సమర్థతతో అధిగమిస్తారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం సంకటంగా మారుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. కీలక వ్యవహారంలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సహకారమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజంతా ఆరోగ్యకరంగా, శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు పెండింగ్ పనులు పూర్తి చేయడం పట్ల దృష్టి సారిస్తే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. విశేషమైన ఆర్థికఫలితాలతో సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా గడుపుతారు. ప్రయాణం అనుకూలం. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. వృత్తి పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. చక్కని అదృష్టం, లక్ష్మీకటాక్షం సంపూర్ణంగా ఉంటాయి. మనోధైర్యంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. సామాజిక గుర్తింపు, పదోన్నతి లభించే సూచనలున్నాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనిలో మీరు చూపే సంకల్పం, నిబద్ధత కారణంగా ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో రాబడి పెరగడం సంతోషం కలిగిస్తుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులలో విజయం సిద్ధిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవరాలలో ధనలాభాలు మెండుగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు చికాకు పెడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. దూకుడు తగ్గించుకుంటే పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్య ఇబ్బంది పెట్టవచ్చు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సృజనాత్మకంగా వ్యవహరించి ఉన్నత స్థానంకు చేరుకుంటారు. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.