మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సమయం అనుకూలించడం లేదు కాబట్టి వృత్తి ఉద్యోగాలలో ఆచి తూచి నడుచుకోవాలి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో సరైన ప్రణాళికతో ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో వాదనలు, ఉద్రిక్తతలు ఏర్పడకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యంతో గందరగోళం నెలకొంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా విశేష లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
మిథునం (Gemini)
ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పనిభారంతో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలలో వేగం పెంచాలి. విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రత పెంచితే విజయం సాధించగలరు. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా వ్యాపారులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం, ఆర్థికవృద్ధి ఉంటాయి. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆదాయంలో వృద్ధి కనబడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ వాహన యోగాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ వంటి ప్రయోజనాలు పొందుతారు. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాహితులకు గృహ జీవితంలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి సున్నితంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించని ధనలాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబం, వృత్తి మధ్య సమతుల్యతను పాటించడం వల్ల మీ సమర్థత పెరుగుతుంది. వృత్తి సంబంధిత ప్రయాణాలు, అధిక ఖర్చులు ఉండవచ్చు. ప్రేమలో ఉన్నవారికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అదనపు రాబడితో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.పెండింగ్ కోర్టు కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కొన్ని పరిస్థితుల్లో ఆచి తూచి నడుచుకోవాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. మెరుగైన ప్రయోజనాల కోసం తీవ్రంగా శ్రమించాలి. పని పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం తగదు. వ్యాపారులు సవాళ్లు, పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ పట్టుదలతో అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో విజయాలను సాధిస్తారు. వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులు రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, పదోన్నతులు ఆర్థిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మూడో వ్యక్తి ప్రమేయంతో కుటుంబ కలహాలు ఏర్పడతాయి. సంపదతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు గడించాలంటే స్థిరమైన ప్రణాళిక ఉండాలి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రమాదకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.