మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కృషి ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు, స్థానచలనాలు ఉంటాయి. నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం చికాకు పెడుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఇంటా బయట సమస్యలు ఉండవచ్చు. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. వారం మధ్యలో సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. పదోన్నతులు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పురోగతి సంతృప్తి కలిగిస్తుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు ఉండవచ్చు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలిగే అవకాశముంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో కీలక పురోగతి ఉంటుంది. ఉద్యోగ రీత్యా దూరప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. గణనీయమైన లాభాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టినవారు మంచి లాభాలు పొందుతారు. బంధువులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రుణభారం తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. మానసిక ఒత్తిడులు తొలగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగితే మంచిది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని దూరప్రాంతాలకు విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. సోదరుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. పట్టుదలతో వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అయితే కీలక పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. నూతన ఆదాయ వనరులు అందుకుంటారు. వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. అత్యంత శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వారం చివరిలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. దైవబలంతో వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కెరీర్ పరంగా, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు అధిక లాభాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి. అవివాహితులకు వివాహ సూచన ఉంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. సంపద పెరుగుతుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. నూతన వాహన యోగం ఉంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే శుభ సమయం నడుస్తోంది.