Site icon vidhaatha

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి దాయాదులతో మాటపట్టింపులు..!

మేషం (Aries)

ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పనుల్లో కదలిక ఉంటుంది. కోర్టు తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus)

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. ఉన్నత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగులతో సామరస్యంగా వ్యవహరిస్తారు. భూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు.

మిథునం (Gemini)

స్నేహితులు, ఆత్మీయులను కలుసుకుంటారు. పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రయాణాలు సంతృప్తిగా, లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.

కర్కాటకం (Cancer)

మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అందరి ప్రోత్సాహం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో అనుకూల తీర్పు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల వారం. అధికారుల ఆదరణ, పనితనానికి గుర్తింపు లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.

సింహం (Leo)

ఆరోగ్యం మెరుగవుతుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచన. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. తాత్కాలిక వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చును. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

కన్య (Virgo)

వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ మరమ్మతుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. భూ తగాదాలు ముందుకు రావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.

తుల (Libra)

మంచి అవకాశాలు వస్తాయి. సమయస్ఫూర్తితో స్పందించండి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరక శ్రమ పెరగవచ్చు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఓపికతో ఉండటం అవసరం. వ్యాపారం పురోగతి సాధిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు.

వృశ్చికం (Scorpio)

శుభకార్యాలు చేస్తారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బంధువర్గం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పనులపై శ్రద్ధ నిలుపుతారు. నలుగురికి సాయపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. న్యాయపరమైన ఆటంకాలను అధిగమిస్తారు. సత్ఫలితాలు పొందుతారు.

ధనుస్సు (Sagittarius)

ఆదాయం స్థిరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు స్నేహితుల సహకారం లభిస్తుంది. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది.

మకరం (Capricorn)

కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. భూ లావాదేవీల్లో కాలయాపన ఉంటుంది. దాయాదులతో మాటపట్టింపులు ఉండవచ్చు. శుభకార్యాలకు హాజరవుతారు.

కుంభం (Aquarius)

ఈ వారం మీ అంచనాలు తలకిందులు అవుతాయి. మీ వైఖరి వల్ల మిత్రులను దూరం చేసుకుంటారు. స్వార్థం వీడితే ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు మిశ్రమ వాతావరణం. భూమి కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల మద్దతు తగ్గుతుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం.

మీనం (Pisces)

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో హుందాగా వ్యవహరిస్తారు. ఆత్మీయులు, అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం వద్దు.

Exit mobile version