Site icon vidhaatha

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల ఉద్యోగుల‌కు కోరుకున్న చోటికీ బ‌దిలీ..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండడం అవసరం. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు అందుకుంటారు. స్థానచలనం సూచన ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణభారం, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితితో ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు పెంచుకోవడంపై దృష్టి సారించండి. ఈ వారం అనారోగ్య సూచన ఉంది కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు కష్టపడితే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కొంతకాలం వేచి ఉంటే మంచిది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు మిత్రుల సహాయంతో కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా విశేష లాభాలు అందుకుంటారు. విద్యార్థులు కఠిన శ్రమతోనే విజయం సాధించగలరు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తొలగుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథునం (Gemini)

ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు శుభవార్తలు వింటారు. కొత్త ఒప్పందాలకు, వ్యాపార విస్తరణకు శుభ సమయం. ఊహించని లాభాలు అందుకుంటారు. స్థిరమైన ఆర్థిక పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం. అన్ని రంగాల వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం నెలకొంటుంది. విద్యార్థులు తమ చదువులపై మరింత దృష్టి పెట్టాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో కెరీర్, వ్యాపార పరంగా కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. మంచి ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించగలరు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ఖర్చులు నివారించండి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం మంచి అదృష్టం, మెరుగైన ప్రయోజనాలు అందుకుంటారు. స్నేహితుల సహాయంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీ ఉండవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోండి. విద్యార్థులు సానుకూల ఫలితాల కోసం మరింత కృషి చేయాలి. ప్రేమ వ్యవహారాల్లో, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడంలో కష్టమవుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

తుల (Libra)

తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మేలు. వృత్తి వ్యాపారాలలో అవాంతరాలు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశతో ఉంటారు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. దైవ బలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధిత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ప్రయాణాలు అనుకూలించవు. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు, వ్యాపార అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్థులు ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోకుండా జాగ్రత్త పడండి. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు సానుకూలతతో ముందుకెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇల్లు, భూమి కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం. విద్యార్థులకు చదువుపై పూర్తి దృష్టి అవసరం.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. వ్యాపారస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. స్నేహితులతో విహార యాత్రలకు వెళతారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ పట్టుదలతో అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తితో విజయాలు సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇంటికి బంధువులు రావడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, పదోన్నతులు ఆర్థిక లాభాలు పొందుతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులు కోరుకున్న ప్రమోషన్ పొందుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. మునుపెన్నడూ లేనంతగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

Exit mobile version