విధాత, యాదాద్రి భువనగిరి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ హుండీల కానుకలను మంగళవారం లెక్కించారు. 14 రోజుల హుండిలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 90,33,396-00 ఆదాయం సమకూరింది.
ఈ నగదుతో పాటు మిశ్రమ బంగారము 0-105-000 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 03-120-000 గ్రాములు వచ్చాయి. అదే విధంగా విదేశీ, ప్రవాస భారతీయ భక్తులు విదేశీ కరెన్సీలో అమెరికా – 616 డాలర్లు, యూఏఈ – 10 దిరామ్స్, ఆస్ట్రేలియా -250 డాలర్స్, ఇంగ్లాండ్ -10 పౌండ్స్, యూరో -5, కెనడా -50 డాలర్స్, ఒమాన్ -600 బైసా సమర్పించారు.