August Bank Holidays |
ప్రస్తుతం రోజుల్లో బ్యాంకులావాదేవీలు జరుపుతుండడం సాధారణమే. డిజిటిల్ చెల్లింపులు పెరిగినా ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లడం తగ్గడం లేదు. క్యాష్ డిపాజిట్లు, పెద్ద ఎత్తున నగదు విత్‌డ్రా కోసం బ్యాంకులకు వెళ్లక తప్పడం లేదు. అయితే, సాధారణ ఉద్యోగుల మాదిరిగానే బ్యాంకులకు సైతం సెలవులుంటాయి.
ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటున్నాయో తెలుసుకుంటే పనులు చేసుకోవడం మరింత సులభంగా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. త్వరలో ఆగస్ట్ నెల రాబోతున్నది. వచ్చే నెల (ఆగస్ట్)లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు 18 రోజులు బ్యాంకులు పని చేయవు. ఆగస్ట్ 11న రక్షాబంధన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు కాగా.. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు మూసే ఉండనున్నాయి.
ఏయే రోజు సెలవులు..
ఆగస్టు 1న దృపక షీ జీ పండుగ సందర్భంగా సిక్కీంలో సెలవు.
ఆగస్టు 7న ఆదివారం దేశవ్యాప్తంగా సెలవ్.
ఆగస్టు 8న మొహర్రం జమ్మూకశ్మీర్‌లో మాత్రమే మూసివేత.
ఆగస్టు 9న మొహర్రం సందర్భంగా పలుచోట్ల బ్యాంకులకు సెలవ్.
ఆగస్టు 11, 12న రక్షా బంధన్ సందర్భంగా పలు ప్రాంతాల్లో మూసివేత.
ఆగస్టు 13న రెండో శనివారం.
ఆగస్టు 14న ఆదివారం.
ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం.
ఆగస్టు 16న పార్శీ నూతన సంవత్సరం.
ఆగస్టు 18న జన్మాష్టమి సందర్భంగా భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లక్నో
ఆగస్టు 19న జన్మాష్టమి నేపథ్యంలో అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ బ్యాంకుల మూసివేత.
ఆగస్టు 20న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.
ఆగస్టు 21న ఆదివారం
ఆగస్టు 22న నాల్గో శనివారం
ఆగస్టు 28న ఆదివారం
ఆగస్టు 29న శ్రీమంత్ శంకర్‌దేవ్ జయంతి (గువహాటి)
ఆగస్టు 31న వినాయక చవితి సందర్భంగా సెలవు.