Site icon vidhaatha

‘ఖుషి’.. అవతార్‌2కే షాక్ ఇస్తోందిగా..!

విధాత‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘ఖుషి’ సినిమాది ఒక ప్రత్యేకమైన స్థానం. నేటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ నాటి నుండి మొదలైంది అంటే అతిశయోక్తి కాదేమో! టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లో సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.

కానీ పవన్ కళ్యాణ్‌కి మాత్రమే ఎందుకు అంత క్రేజ్ అనే విషయం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థం కాదు కూడా. బహుశా కెరీర్ ప్రారంభంలో ఆయన చేసిన చిత్రాలు ఆయనను ఈ స్థాయిలో నిల బెట్టాయని చెప్పవచ్చు. ‘గోకులంలో సీత, తమ్ముడు, సుస్వాగతం, తొలిప్రేమ, ఖుషి’ వంటి చిత్రాలు దానికి బీజం వేశాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏడవ సినిమా ఇది. యూత్‌లో పవర్ స్టార్ క్రేజ్‌ని ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఎంతో పెంచింది. పవన్ పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్, డైలాగ్స్, డాన్సులు, మేనరిజం, యాటిట్యూడ్ కుర్ర‌కారుకు పిచ్చపిచ్చ‌గా నచ్చేశాయి. ఇప్పటికి ఖుషి చాలామందికి ఫేవరెట్ ఫిలిం.

టీవీలో టెలికాస్ట్ అవుతున్నా సరే మిస్ కాకుండా చూస్తారు. వీలుంటే యూట్యూబ్‌లో కూడా ఓ లుక్ వేస్తారు. ఈ చిత్రం 2001లో విడుదలైంది అంటే ఇప్పటికీ 21 ఏళ్లు గడిచింది. అయినా ఇప్పటికీ ఖుషి అంటే జనాలలో అదే క్రేజ్. దాంతో ఈ సినిమా 21 ఏళ్ల తర్వాత మరల థియేటర్లలో సందడి చేయబోతోంది.

పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య‌ని తెలుగుకి పరిచయం చేస్తూ శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏం రత్నం నిర్మించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. మొత్తానికి ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది.

దాంతో వారి కోరికను తీరుస్తూ అధికారికంగా ఈ చిత్రాన్ని 31వ తారీఖున అంటే న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ చేయబోతున్నట్టు రత్నం ప్రకటించాడు. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో అప్పటినుండి ‘ఖుషి’ మూవీ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.

ఇక బుక్ మై షో లో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా టికెట్స్ ని బుక్ చేసేందుకు వెతకడం మొదలుపెట్టారు. అలా ఒకేసారిగా వేలాది మంది బుక్ మై షో లో ఖుషి సినిమా కోసం సెర్చ్ చేయడం వల్ల ‘అవతార్ 2’ చిత్రాన్ని కూడా వెనక్కి నెట్టి ‘ఖుషి’ చిత్రం నెంబర్ వ‌న్ స్థానంలో ట్రెండింగ్ కావ‌డం మొదలుపెట్టింది.

కేవలం ఒక్క ప్రకటనకి ఈ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తే.. ఇక అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఇటీవల పవన్ ఫ్యాన్స్ ‘గబ్బర్ సింగ్, జల్సా’ సినిమాల స్పెషల్ షోస్ వేసుకున్నారు. ఈ హంగామా చూసే మేకర్స్ ‘ఖుషి’ని 4కె వెర్షన్‌లో రీరిలీజ్ చేయనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇది 21 ఏళ్ల కింద‌టి సినిమా కాబట్టి దీన్ని ఫోర్ కె అల్ట్రా హెచ్డి క్వాలిటీతో డిటిఎస్ తో డిజిటల్ లోకి కన్వర్ట్ చేసి క్యూబ్ లోకి మార్చే ప్రాసెస్ చేశారు. ఆల్రెడీ పవన్ పుట్టినరోజు సందర్భంగా ఖుషి ట్రైలర్ రీలోడెడ్ పేరుతో స్పెషల్గా ట్రైల‌ర్స్ క‌ట్ చేయగా నెట్టింట అవి వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అదే నిర్మాత ఏం.రత్నం నిర్మిస్తున్న హిస్టారికల్ ఫిలిం హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు చిత్రం నుంచి మ‌రో కొత్త టీజ‌ర్ కట్ చేసి దాన్ని ఖుషి థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version