Site icon vidhaatha

భ‌ర్త వీర్యంతో భార్య‌లో మంట‌లు, ద‌ద్దుర్లు.. హైద‌రాబాద్‌లో ఇదే తొలి కేసు..!

పెళ్లైన ఒక సంవ‌త్స‌రానికో, రెండేండ్ల‌కో పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఏ దంప‌తులైనా క‌లలు కంటారు. అందుకోసం ప్రణాళిక‌లు వేసుకుంటారు. కానీ ఓ దంప‌తుల జీవితంలో ఆ క‌ల నెర‌వేర‌డం లేదు. వివాహ‌మై ఆరేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ.. వారు త‌ల్లిదండ్రులు కాలేక‌పోతున్నారు. ఇంకో విష‌యం ఏంటంటే.. ఆ దంప‌తులిద్ద‌రూ శారీర‌కంగా క‌లిసిన స‌మ‌యంలో భార్య‌కు తీవ్రమైన మంట‌లు, ద‌ద్దుర్లు, ద‌గ్గు, జ్వ‌రం వ‌స్తున్నాయి. అస‌లు ఎందుకిలా అవుతుందో తెలుసుకునేందుకు భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా, వారు చెప్పింంది విని షాక‌య్యారు.

విధాత: హైద‌రాబాద్‌కు చెందిన ఓ జంట‌కు ఆరేండ్ల క్రితం వివాహ‌మైంది. పిల్ల‌ల కోసం ప్ర‌య‌త్నించారు. కానీ ఫ‌లితం లేదు. గ‌ర్భం ధ‌రించేందుకు ఎన్నో మందులు వాడారు. చాలా మంది వైద్యుల స‌ల‌హాల‌ను కూడా తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమె గ‌ర్భం ధ‌రించ‌లేదు.

అయితే ఆ దంప‌తులిద్ద‌రూ శృంగారంలో పాల్గొన్న త‌ర్వాత‌.. అంటే 30 నిమిషాల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు భార్య శ‌రీరంలో మార్పులు సంభ‌వించేవి. అవేంటంటే.. భ‌ర్త వీర్యం ప‌డిన ప్ర‌దేశంలో మంట‌గా అనిపించడం, ద‌ద్దుర్లు రావ‌డం, ద‌గ్గు, జ్వ‌రంతో బాధ‌ప‌డ‌టం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించేవి.

దీంతో ఆ దంప‌తులిద్ద‌రూ ఎల‌ర్జీ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ వ్యాక‌ర‌ణం నాగేశ్వ‌ర్‌ను సంప్ర‌దించారు. వారికి కొన్ని వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. ఆమెకు త‌న భ‌ర్త వీర్యం ప‌డ‌టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భార్య‌కు సీమెన్ హైప‌ర్ సెన్సిటివిటీ రియాక్ష‌న్ ఉండ‌టంతో అలా జ‌రుగుతుంద‌ని నిర్ధారించారు. ఇలాంటి కేసులు ప్ర‌పంచంలో ప‌లు చోట్ల వెలుగు చూసిన‌ప్ప‌టికీ.. హైద‌రాబాద్‌లో ఇదే మొద‌టి కేసు అని పేర్కొన్నారు.

వైద్య ప‌రీక్ష‌ల్లో భాగంగా.. బాధితురాలి చేతిని స్టెరిలైజ్ చేసి.. నొప్పి తెలియ‌కుండా చేసే చ‌ర్మ ప‌రీక్ష నిర్వ‌హించారు. భ‌ర్త నుంచి సేక‌రించిన 0.5 మి.మీ. వీర్యాన్ని ఆమె చ‌ర్మంపై ఉంచ‌గా ఎల‌ర్జీ రియాక్ష‌న్ క‌నిపించింది. దీంతో ఆమెకు సీమెన్ ఎలర్జీ లేదా హైపర్‌సెన్సిటివిటీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.

ఈ ఎల‌ర్జీ స‌మ‌స్య‌పై దృష్టి సారించాల్సిందేనని నాగేశ్వ‌ర్ పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య ప్రాణాంత‌క‌మైన ఎల‌ర్జిక్ అనాఫైలాక్టిక్ షాక్‌కు దారి తీసే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే శృంగారం స‌మ‌యంలో నిరోధ్ వాడితే అంత స‌మ‌స్య ఉత్ప‌న్నం కాక‌పోవ‌చ్చ‌న్నారు. ఇక సంతానం కోసం వేరే మార్గాన్ని ఎంచుకోవాల‌ని సూచించారు. ఇన్‌ఫెర్టిలిటీ నిపుణుల సాయంతో పిల్ల‌ల‌ను క‌నేందుకు ప్రయ‌త్నించొచ్చ‌ని చెప్పారు.

Exit mobile version