Beauty tips | మీ కనురెప్పలు అందంగా ఉండాలా.. అయితే ఈ టిప్స్‌ పాటించండి..!

Beauty tips : ముఖానికి కళ్లు ఎంతో అందాన్నిస్తాయి. అయితే ఆ క‌ళ్లకు వన్నె తెచ్చేవి కనురెప్పలు. అందుకే క‌నురెప్పలు అందంగా కనిపించడం కోసం మ‌గువ‌లు ఐలాష్ లాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే కృత్రిమ కనురెప్పలను కూడా వినియోగిస్తున్నారు.

  • Publish Date - April 17, 2024 / 07:39 PM IST

Beauty tips : ముఖానికి కళ్లు ఎంతో అందాన్నిస్తాయి. అయితే ఆ క‌ళ్లకు వన్నె తెచ్చేవి కనురెప్పలు. అందుకే క‌నురెప్పలు అందంగా కనిపించడం కోసం మ‌గువ‌లు ఐలాష్ లాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే కృత్రిమ కనురెప్పలను కూడా వినియోగిస్తున్నారు. వాస్తవానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మీకు కృత్రిమ క‌నురెప్పల అవసరం రాదు. మీ కనురెప్పలనే ఒత్తుగా, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. వంటింటి ప‌దార్థాలతో కూడిన ఆ సింపుల్‌ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వంటింటి చిట్కాలు

మొద‌టి చిట్కా : ఆముదానికి కనురెప్పలను అందంగా తీర్చిదిద్దే గుణాలున్నాయి. శుభ్రమైన బ్రష్ లేదా దూదిని ఆముదంలో ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకు రాసుకోవాలి. త‌ర్వాత రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలలపాటు పాటిస్తే ఒత్తయిన కనురెప్పలు మీ సొంతం. అయితే కొంద‌రికి ఆముదం అల‌ర్జీ ఉంటుంది. ద‌ద్దుర్లు వ‌చ్చే ప్రమాదం ఉంది. కాబ‌ట్టి ఈ చిట్కాను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

రెండో చిట్కా : కోడిగుడ్డులో క‌నురెప్పలు ఒత్తుగా పొడవుగా పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. గుడ్డులోని బయోటిన్, విటమిన్ బి కూడా క‌నురెప్పల పెరుగుదలకు, అవి నల్లగా ఉండేందుకు తోడ్పడతాయి. ఓ గిన్నెలో గుడ్డును కొట్టిపోసి, దానికి టేబుల్ స్పూన్ గ్లిజరిన్‌ను కలుపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంతవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దూది ఉండను ఈ మిశ్రమంలో ముంచి కనురెప్పల వెంట్రుకలకు రాసుకొని 15 నిమిషాలపాటు ఆరనివ్వాలి. అనంత‌రం చల్లటి నీటితో క‌డ‌గాలి. వారంలో మూడు రోజులపాటు ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

మూడో చిట్కా : గ్రీన్ టీలో ఉన్న ఫ్లవనాయిడ్స్ కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరగ‌డానికి దోహదపడుతాయి. వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగును ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత టీ బ్యాగ్‌ను తీసేసి నీటిలో దూది ఉండను ముంచి బాగా పిండాలి. త‌ర్వాత ఆ దూదితో కనురెప్పల మొదళ్ల నుంచి చివరిదాకా రాయాలి. కాసేప‌టి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు చొప్పున వరుసగా మూడు నెలలపాటు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కానీ ఈ చిట్కాను పాటించేట‌ప్పుడు గ్రీన్ టీ కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

నాలుగో చిట్కా : కొబ్బరిపాలలో దూదిని ముంచి క‌నురెప్పల‌కు రాసుకోవాలి. ఆ త‌ర్వాత ప‌ది నిమిషాల‌పాటు ఆర‌నిచ్చి చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. కొబ్బరిపాలలో ఉండే కొవ్వులు క‌నురెప్పల‌ను ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. రోజూ కాసేపు కొబ్బరి నూనెతో మ‌ర్దన చేసుకుంటే కూడా కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. నూనెలోని సహజ కొవ్వులు, ప్రొటీన్‌లు, లారిక్ ఆమ్లం, విటమిన్ ఇ, ఐరన్ లాంటివి అందుకు తోడ్పడుతాయి.

Latest News