Health Tips | పిస్తాలో అనేక పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ బీ6, ప్రొటీన్స్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పిస్తాపప్పును రెగ్యులర్‌గా తీసుకుంటే పలురకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. చాలామంది పిస్తాలను నీటిలో నానబెట్టి తింటుంటారు. కానీ, పిస్తాలను పాలలో మరిగించి తింటే ఇంకా ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయి. పాలలో మరిగించి తింటే ఎలాంటి లాభాలుంటో ఓ సారి తెలుసుకుందాం రండి..!
- పిస్తాపప్పులు పాలు కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. పాలతో పాటు పిస్తాలో చాలా ప్రోటీన్లు ఉంటాయి. కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. పాలు, పిస్తాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఎముకలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిస్తాలను పాలలో మరిగి తీసుకుంటే కీళ్ల నొప్పులు కూడా దూరమవుతాయి.
- మొబైల్, ల్యాప్‌టాప్‌లో నిరంతరం పనిచేసే వ్యక్తులు వారి కళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీంతో పాలతో కలిపి పిస్తాలను తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆవుపాలతో కలిపి పిస్తాను ఈసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
- పాలు, పిస్తాలు కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.