Health tips | తేనెతో గుండెపోటుకు చెక్ పెట్టవచ్చట.. ఎలుకలపై పరిశోధనలో వెల్లడి.. ఎలాగంటే..!

Health tips : ఏ ప‌దార్థమైనా తీయ‌గా ఉందంటే అందులోని చ‌క్కెర‌లే కార‌ణం. కొన్ని ర‌కాల‌ పండ్లు, కూర‌గాయ‌లు స‌హా వివిధ ర‌కాల ప‌దార్థాల్లో చ‌క్కెర‌లు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే చక్కెర పదార్థం ఉంటుంది.

  • Publish Date - April 15, 2024 / 07:14 AM IST

Health tips : ఏ ప‌దార్థమైనా తీయ‌గా ఉందంటే అందులోని చ‌క్కెర‌లే కార‌ణం. కొన్ని ర‌కాల‌ పండ్లు, కూర‌గాయ‌లు స‌హా వివిధ ర‌కాల ప‌దార్థాల్లో చ‌క్కెర‌లు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే చక్కెర పదార్థం ఉంటుంది. ఆ చక్కెర రకాన్ని ట్రెహలోజ్‌ అంటారు. ఈ ట్రెహ‌లోజ్ గుండె వ్యాధుల‌ను నివారించ‌డానికి తోడ్పడుతుందని ఒక అధ్యయ‌నంలో తేలింది.

ప‌రిశోధ‌కులు కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్ చేసి ప‌రిశోధించారు. ఆ ప‌రిశోధ‌నా ఫ‌లితాలు ట్రెహలోజ్‌ గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తుందనే అభిప్రాయం కలుగజేశాయట. తేనెలోని ట్రెహ‌లోజ్‌ను ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్ (ఒక‌ ర‌క‌మైన పాచి) చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించిందట‌.

అయితే ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లో, ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్‌ చేసిన ఎలుక‌ల్లో మాత్రం ప్లాక్ తగ్గుదల కనిపించలేదట‌. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్‌ అనే ఒక రకం ఇమ్యూన్‌ కణాలు చేస్తుంటాయి. మ్యాక్రోఫేజ్‌ కణాలను పుట్టించడానికి అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్‌ ఉత్పాదనకు ట్రెహలోజ్‌ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్‌ సాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విష‌యాన్ని నిర్ధారించేందుకు వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు.

Latest News