Health tips | కాలేయం గురించి మీకు ఎంత తెలుసు.. లివర్‌ వ్యాధులకు హోమియో చికిత్స ఉందా..?

Health tips : శరీరంలోని అత్యంత ప్రధానమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. జీర్ణక్రియల నిర్వహణలోనే కాకుండా రక్తశుద్ది ప్రక్రియలోనూ, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలోనూ కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థకు ఇది తోబుట్టువు లాంటిది. వాస్తవానికి జీర్ణక్రియ పేగుల్లోనే జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆ ఆహారాన్ని శరీర కణాలు యథాతథంగా తీసుకోలేవు. కాలేయం వాటిని శరీర కణాలు సంగ్రహించేందుకు అనువుగా మారుస్తుంది. కాలేయ కణాలను హెపాటాసైట్స్‌ అంటారు. ఇవి శక్తి సమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి.

  • Publish Date - June 13, 2024 / 06:56 PM IST

Health tips : శరీరంలోని అత్యంత ప్రధానమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. జీర్ణక్రియల నిర్వహణలోనే కాకుండా రక్తశుద్ది ప్రక్రియలోనూ, శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలోనూ కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థకు ఇది తోబుట్టువు లాంటిది. వాస్తవానికి జీర్ణక్రియ పేగుల్లోనే జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆ ఆహారాన్ని శరీర కణాలు యథాతథంగా తీసుకోలేవు. కాలేయం వాటిని శరీర కణాలు సంగ్రహించేందుకు అనువుగా మారుస్తుంది. కాలేయ కణాలను హెపాటాసైట్స్‌ అంటారు. ఇవి శక్తి సమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి.

కాలేయం ఏం చేస్తుంది..?

కాలేయం రోగ కారక క్రిములతో పోరాడుతుంది. హానికారక విష పదార్థాలను శరీరం నుంచి వేరు చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు అవసరమయ్యే పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్‌ ఫ్యాక్టర్లను తయారు చేస్తుంది. పోషక పదార్థాలను, విటమిన్లను నిలువ చేస్తుంది. ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, క్లిష్ట కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో, గ్లూకోజ్‌, కొలెస్టరాల్‌ల వినియోగంలో, వ్యర్థ పదార్థాల విసర్జనలో కీలకపాత్ర పోషిస్తుంది.

కాలేయ వ్యాధులకు కారణాలు..

కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌లు ముఖ్యంగా హెపటైటిస్‌ ఏ, బీ, సీ, డీ, ఈ వైరస్‌లు, దీర్ఘ కాలికంగా అధిక మోతాదులో వాడే మందులు, కొన్ని రసాయన పదార్థాలు, కాలేయ వ్యాధులకు కారణమవుతాయి. వీటితోపాటు దీర్ఘకాలికంగా అధిక మోతాదులో ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు, వంశపారంపర్యంగా వచ్చే హీమోక్రొమటోసిస్‌ లాంటి సమస్యలు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం లాంటివి కూడా కాలేయ వ్యాధికి దారితీస్తాయి. అదేవిధంగా మిగతా శరీర భాగాలకు వచ్చినట్టే కాలేయానికి కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.

సిర్రోసిస్‌ సమస్య..

ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ సోకి కాలేయ కణాలు నష్టపోయినప్పుడు సహజంగానే కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే కొత్తగా ఏర్పడిన ఆ కణాలు మునుపటి సహజ కాలేయ కణాల్లా శక్తివంతంగా పనిచేయలేవు. పైగా కాలేయానికి వచ్చే రక్తప్రసరణలో ఆటంకంగా కూడా మారతాయి. ఈ స్థితినే లివర్‌ సిర్రోసిస్‌ అంటారు.

సిర్రోసిన్‌ లక్షణాలు

సిర్రోసిస్‌ సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక స్థితిలో వ్యాధి లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. కానీ ఆ మలిదశలో నీరసం, నిస్సత్తువ, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి తగ్గుదల, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సిర్రోసిస్‌ వ్యాధి పెరుగుతున్న క్రమంలో ప్రతి చిన్న కారణానికే రక్తస్రావం కావడం, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లవాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సహజంగా కాలేయం శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. అయితే కాలేయం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ప్రక్రియ జరగదు. ఫలితంగా వ్యర్థ పదార్థాలు రక్తం ద్వారా అన్ని అవయవాలకు చేరడంతో వాటి పనితనం కుంటుపడుతుంది. ఈ కారణంగా రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. సమస్య ప్రారంభంలోనే సరైన వైద్య చికిత్సలు తీసుకోకపోతే సిర్రోసిస్‌ తీవ్రమై ప్రాణాపాయ స్థితికి కూడా చేరవచ్చు. కాలేయ మార్పిడి చేయాలంటే దాత కావాలి. దాత దొరికినా ఆ సర్జరీ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ ఉండదు.

హోమియో వైద్యం బెటర్‌

కాలేయం పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన మందులు హోమియోపతిలో మాత్రమే ఉన్నాయి. దుష్ప్రభావాలకు ఏ మాత్రం తావు లేకుండా సహజ భౌతిక సూత్రాలకు లోబడి హోమియో మందులు పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరచడంతోపాటు రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ చికిత్సలు ఉంటాయి.

Latest News