Raisins Benefits | ఎండు ద్రాక్ష వ‌ల్ల గుండెకు ఎంతో మేలు..!

Raisins Benefits | ఎండు ద్రాక్ష ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. చాలా మంది ఎండు ద్రాక్ష‌ను టైంపాస్‌కు తినేస్తుంటారు. దీని వ‌ల్ల తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. మ‌రి ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఛాతీలో మంట పూర్తిగా త‌గ్గిస్తుంది. జీర్ణ‌కోశ వ్య‌వ‌స్థ స‌జావుగా ప‌ని చేయిస్తుంది. అధిక ర‌క్త‌పోటుకు దూరంగా ఉంచుతుంది. ఎండు ద్రాక్ష‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది కాబ‌ట్టి.. మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి విముక్తి పొందొచ్చు. - స్త్రీలు ఎండు ద్రాక్ష తిన‌డం […]

  • Publish Date - March 5, 2023 / 02:09 AM IST

Raisins Benefits | ఎండు ద్రాక్ష ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. చాలా మంది ఎండు ద్రాక్ష‌ను టైంపాస్‌కు తినేస్తుంటారు. దీని వ‌ల్ల తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. మ‌రి ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఛాతీలో మంట పూర్తిగా త‌గ్గిస్తుంది. జీర్ణ‌కోశ వ్య‌వ‌స్థ స‌జావుగా ప‌ని చేయిస్తుంది. అధిక ర‌క్త‌పోటుకు దూరంగా ఉంచుతుంది. ఎండు ద్రాక్ష‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది కాబ‌ట్టి.. మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి విముక్తి పొందొచ్చు.

– స్త్రీలు ఎండు ద్రాక్ష తిన‌డం వ‌ల్ల ఐర‌న్, విట‌మిన్ బీ కాంప్లెక్స్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో వారిలో బ్ల‌డ్ కౌంట్ పెరిగే అవ‌కాశం ఉంది. హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.

-పురుషులకు ఇది అమృత ఫ‌లం. ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యంలో వేడి పాల‌లో ఎండు ద్రాక్ష‌ను క‌లిపి తీసుకుంటే.. శుక్ర క‌ణాల పెరుగుద‌ల‌కు తోడ్ప‌డుతుంది. అంతే కాకుండా అంగ స్తంభ‌న స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

– ఎండు ద్రాక్ష‌లో వాపు ప్ర‌క్రియ‌ను అణిచే, ర‌క్త‌నాళాల్లో పూడిక‌ల‌ను తొల‌గించే రిస్‌వెర‌టాల్ ర‌సాయ‌న‌మూ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ మోతాదుల‌ను త‌గ్గిస్తుంది. ర‌క్త క‌ణాలు విప్పారేలా ప‌ని చేస్తుంది. దీంతో ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. ఇలా గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

– ఆర్థ‌రైటిస్‌తో బాధ‌ప‌డేవారికి ఎండు ద్రాక్ష ఒక వ‌రం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, పోటాషియం వంటి అనేక ఖ‌నిజాల‌కు ఎండుద్రాక్ష‌లు స్టోర్ హౌజ్‌లు. కాబ‌ట్టి ఈ ఫ‌లం తిన‌డం వ‌ల్ల ఎముక‌ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Latest News