Site icon vidhaatha

Ridge Gourd | ఈ సమస్యలు ఉన్నవాళ్లు బీరకాయలు అస్సలు తినవద్దట..!

Ridge Gourd : బీరకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా పీచుపదార్థం కూడా ఎక్కువే. అందువల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇలా బీరకాయలు మనకు అందించే ప్రయోజనాలు పుష్కలం. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు బీరకాయలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

అలర్జీ సమస్యలు ఉ్నవాళ్లు బీరకాయలను తినకూడదు. ఒకవేళ తింటే చర్మంపై దురద, దద్దుర్లు లాంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. కాబట్టి చర్మ అలర్జీలు ఉన్నవాళ్లు బీరకాయలకు దూరంగా ఉండడమే మంచిది.

అదేవిధంగా గర్భిణీలు కూడా బీరకాయలకు దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వారు బీరకాయలు తినకపోవడమే మంచిది. అంత ప్రమాదం కాకపోయినా.. బీరకాయ గర్భిణీలకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా వికారం, వాంతికి వచ్చినట్లు అనిపిస్తున్న వాళ్లు బీరకాయలను తినకూడదు. తింటే ఆ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవిధంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బీరకాయలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version