Rose Flowers | గులాబీ రేకులతో గుల్కంద్‌ స్వీట్‌..! ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..?

Rose Flowers | గూలాబీ పూలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. గులాబీ పూల‌ను అలంకరణతో పాటు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోజ్ వాటర్‌, రోజ్ ఆయిల్ చాలా మంది మహిళలకు చర్మ సంరక్షణలో ఎక్కువగా వినియోగించే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

  • Publish Date - June 26, 2024 / 01:00 PM IST

Rose Flowers | గూలాబీ పూలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. గులాబీ పూల‌ను అలంకరణతో పాటు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోజ్ వాటర్‌, రోజ్ ఆయిల్ చాలా మంది మహిళలకు చర్మ సంరక్షణలో ఎక్కువగా వినియోగించే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, గులాబీ రేకులతో గుల్కంద్‌ స్వీట్‌ తయారు చేస్తారని ఎంత మందికి తెలుసు..? ఈ స్వీట్‌తో ఎన్నో ఆరోగ్య రకాల ప్రయోజనాలుయని ఆయుర్వేదం చెబుతున్నది. గుల్కంద్‌ పదం గుల్‌ నుంచి వచ్చిందని.. దీని అర్థం పర్షియన్‌ భాషలో ‘పువ్వు’ అని అర్థం. అరబిక్‌లో ‘కంద్‌’ అంటే ‘తీపి’ అర్థం ఉన్నది. గులాబీ రేకులతో చేసిన గుల్కంద్‌ను తీసుకోవడం వల్ల వేసవికాలంలో ఒంటికి చలవ చేస్తుంది. ఈ గుల్కంద్‌ స్వీట్‌ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉండేందుకు అద్భుతమైన టానిక్‌లా పని చేసే గుల్కంద్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం..!

కావాల్సిన పదార్థాలు..

గులాబీ రేకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. వెడెల్పు మూత ఉన్న గాజు సీసా లేకపోతే జార్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. యాలకులు కావాలి. గులాబీ రేకులను బాగా ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఒక సీసాలో వేసి దానికి కొద్దిగా షుగర్‌, యాకలకుల పొడిని కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలు ఎండలో పెట్టుకోవాలి. రాత్రికి చెక్క స్పూన్‌తో కలుకోవాలి. చెక్క స్పూన్‌ లేకపోతే గరిటకు తడి లేకుండా చూసి కలిపి పక్కనే పెట్టేసేయాలి. దాదాపు నెల రోజుల పాటు ఇలాగే చేయాలి. దీంతో అది జామ్‌ మాదిరిగా మారిపోతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్‌ సలాడ్స్‌లోనూ వాడుకోవచ్చు. చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తీసుకోవచ్చు. నేరుగా కూడా తీసుకోవచ్చు. లేకపోతే తమలపాకులతో కలిపి తినవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..?

ఈ గులాబీ గుల్కంద్‌ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. పిత్త దోషాలకు ఉపయోగకరంగా ఉంటుంది ఆయుర్వేదం చెబుతున్నది. వేడిని పుట్టించడంతో పాటు చల్లగా ఉండేలా కూడా పని చేస్తుంది. దద్దుర్లు, నొప్పులు, నొప్పులు వంటి వేడి సంబంధిత లక్షణాలను నివారిస్తుంది. అరికాళ్లు, అరచేతుల్లోని మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు ఉపయోకరంగా ఉంటుంది. అందుకే తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నియంత్రిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇంకా మంచిది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కప్పు పాలలో వేసి రాత్రిపూట కలిపి తాగితే గాఢ నిద్రలోకి వెళ్తారు. చర్మం త్వరగా ముడతలు పడకుండా చూడడంతో పాటు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. గుల్కంద్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అల్సర్‌, మలబద్దకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం ఉంటుంది. వేసవిలో గుల్కంద్ వాడడం ద్వారా వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం తగ్గుతాయి. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. పీసీఓడీతో బాధపడుతున్న ప్రయోజనకరంగా ఉంటుంది. థైరాయిడ్‌తో బాధపడేవారూ జామ్‌ని తీసుకోవచ్చు.

Latest News