Health Tips | సగ్గు బియ్యంతో చాలా లాభాలున్నాయ్‌.. అవేమిటో తెలుసా..?

  • Publish Date - April 5, 2024 / 10:01 AM IST

Health Tips : మన శ‌రీరానికి ఎంతో మేలుచేసే ప‌దార్థాల్లో స‌గ్గుబియ్యం కూడా ఒక‌టి. ఈ సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్‌, విటమిన్ సి, క్యాల్షియం లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మనం 100 గ్రాముల సగ్గుబియ్యాన్ని తీసుకుంటే 355 కేలరీలు, 94 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లభిస్తాయి. అందుకే సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం త‌క్షణమే ఉత్తేజితమవుతుంది. ముఖ్యంగా వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవేగాక ఈ స‌గ్గు బియ్యంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..!

ప్రయోజనాలు..

1. సగ్గు బియ్యంలో శరీరానికి చలువచేసే లక్షణాలున్నాయి. వీటిని పాలు, చక్కెర పోసి పాయ‌సంలా వండుకుని తింటే చలువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.

2. వేసవి కాలంలో కొంచెం పనిచేసినా త్వరగా అలసిపోతాం. శరీరంలో శక్తి త్వరగా తగ్గిపోతుంది. అలాంటి వారు సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది.

3. ఊబ‌కాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు స‌మ‌తాస్థితిలో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక బరువు కూడా తగ్గుతారు.

4. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయట పడవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకు కూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది.

5. విరేచనాలు అయినప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది. జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

6. సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్‌ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

7. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేయడంతోపాటు బ్లడ్ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.

8. సగ్గుబియ్యంలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. కాబట్టి రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Latest News