Social Media
లండన్: సోషల్ మీడియాలో భాగం పంచుకోకుండా లేదా, మన భావాలను ఇతరులతో పంచుకోకుండా అంటే మన ఆలోచనలను పోస్టు చేయకుండా కేవలం ఇతరుల కంటెంట్‌ను మాత్రమే స్క్రోల్ చేయడం వల్ల ఒత్తిడికి, నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది.
ఆ రిపోర్టు ప్రకారం.. ఇతరులతో మనకు కమ్యూనికేషన్ అవకాశం లేకపోవడం వల్ల, మన గురించి ఇతరులకు తెలియక పోవడం వల్ల మనకు అవసరమైనంత సామాజిక మద్దతు దొరకడం కష్టమవుతుంది.
దానితో మనలో ఒంటరితనం, మనని ఎవరూ పట్టించుకోని పరిస్థితి అనే భావాలు మనలో తలెత్తుతాయి. దీనికి విరుద్ధంగా, కొందరు కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ వున్నప్పటికీ, నేరుగా సోషల్ మీడియాలో అంతగా స్క్రోల్ చేయడానికి ఆసక్తి చూపరు. అయినా వీరిలో వత్తిడి, ఒంటరితనం వంటి దుష్పరిణామాలు అంతగా కనిపించలేదని అధ్యయన నివేదిక వెల్లడించింది.