Site icon vidhaatha

లక్షణాలున్నాయా..? అయితే మీ కిడ్నీల్లో రాళ్లున్నట్టే..!

Health Tips | కిడ్నీ స్టోన్ సమస్య తీవ్రమైన సమస్య. ఈ రాళ్లు నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. మరీ పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంది. కిడ్నీ స్టోన్‌తో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సకాలంలో చికిత్స అందించినట్లయితే తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది. అయితే, కిడ్నీలో రాళ్లు అంటే ఏంటీ.. అవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓ సారి తెలుసుకుందాం..!

కిడ్నీ స్టోన్‌ అంటే..?

కిడ్నీ స్టోన్‌ను కాలిక్యులస్ అని కూడా పిలుస్తారు. కిడ్నీలో పేరుకుపోయే ఒక రకమైన చిన్న రాయి. ఇవి కిడ్నీలో అదనపు పోషకాలు చేరడం వల్ల ఏర్పడుతాయి. వాస్తవానికి శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడానికి కిడ్నీ పని చేస్తుంది. ఒక్కోసారి ఈ టాక్సిన్స్ పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు సాధారణంగా కాల్షియం వంటి ఖనిజాలు చేరడం ద్వారా ఏర్పడతాయి. మూత్రపిండాలే కాకుండా, ఇది మూత్ర నాళంలోకి కూడా ప్రవేశిస్తాయి.

వెన్ను.. కడుపు నొప్పి

కిడ్నీ స్టోన్ కారణంగా తీవ్రమైన నొప్పి సమస్యలు ఎదురవుతాయి. రాళ్లతో కడుపు, వెన్నునొప్పి వస్తుంది. నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. రాయి చిన్నగా ఉంటే నొప్పి తక్కువగా ఉంటుంది. అయితే పెరిగినప్పుడు భరించలేని నొప్పి వస్తుంది.

మూత్రం వాసన

కిడ్నీలో రాయి ఉంటే మూత్రం వాసన వస్తుంది. మూత్రం గాఢతతో వాసన వస్తుంటే.. అవి కిడ్నీ స్టోన్స్‌కు సంకేతంగా భావించారు. అయితే, చాలా సార్లు మందులు తీసుకోవడం ద్వారా కూడా మూత్రంలో దుర్వాసన వస్తుంది.

మూత్రంలో రక్తం

కిడ్నీ స్టోన్ కారణంగా మూత్రంలో రక్తం పడుతుంటుంది. సకాలంలో వైద్యుడికి వద్దకు వెళితే పరీక్షలు చేస్తే రాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ రక్తం చాలా తక్కువ పరిమాణంలో బయటకు వస్తుంది.

Exit mobile version