Health tips : ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అంతేగాక ఆరోగ్యపరంగా ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగ పుదీనాతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. ఆరోగ్యపరంగా పుదీనాతో ఇంకా ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..?
పుదీనాతో ప్రయోజనాలు..
- పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం, వికారం లాంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- శ్వాస సంబంధమైన సమస్యలకు పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
- పుదీనా.. అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో ఉపయోగించాలి. పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు.
- పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
- పుదీనాలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.