Site icon vidhaatha

Health tips | నైట్స్‌ లేటుగా తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారు..?

Health tips : కాలంతోపాటే మనుషుల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దాంతో అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. సమయానికి భోజనం చేయక, సమయానికి నిద్రపోక ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చాలామంది అర్ధరాత్రిపూట తినడానికి రోడ్లపైకి వస్తారు. వారికి తగ్గట్టుగానే రాత్రిపూట టిఫిన్స్‌, భోజనాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇలా లేట్‌ నైట్స్‌ తిని, లేట్‌ నైట్స్‌ నిద్రపోవడం ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది.

ఈ విధంగా రాత్రిపూట ఆలస్యంగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి రాత్రి ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారనే భావన ఉంటుంది. అయితే బరువు పెరగడానికి, లేట్‌ నైట్‌ ఆహారం తీసుకోవడానికి సంబంధం లేకపోయినా.. అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం మాత్రం ఉంది. లేట్‌ నైట్‌ భోజనంతో కలత నిద్ర, అజీర్తి లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి రాత్రి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిది.

బరువు పెరగకూడదంటే మూడు పూటలూ కడుపునిండా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొంతకొంత వ్యవధి ఇచ్చి కొద్దికొద్దిగా తినడం మంచిదని అంటున్నారు. ఆహారం కొద్దిగా తీసుకుని, అందులో పోషకాలు మెండుగా ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నారు. అదేవిధంగా డీటాక్స్‌ డైట్‌ తీసుకోవడంవల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అలాగే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని సూచిస్తున్నారు.

Exit mobile version