Nano Gel | మద్యం ప్రియులు ఎగిరి గంతులేసే వార్త..! ఎంత తాగినా లివర్‌పై ప్రభావం పడకుండా స్పెషల్‌ జెల్‌ని అభివృద్ధి చేసిన పరిశోధకులు..!

Nano Gel | ప్రస్తుత కాలంలో ఆల్కాహాల్‌ తీసుకునే అలవాటు ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యుక్త వయసు నుంచి వృద్ధుల వరకు మద్యం సేవించడం చూస్తూనే ఉన్నాం. మద్యం సేవంతో కాలేయంపై ప్రభావం పడుతుంది. అధిక మోతాలో మద్యం తీసుకోవడంతో లివర్‌ పూర్తిగా పాడయ్యే అవకాశాలుంటాయి. లివర్‌పై ప్రభావం పడితే దాంతో శరీరం మొత్తం దుష్ప్రభావాలు కనిపిస్తాయి. మద్యపానంపై వైద్యులు హెచ్చరికలు చేస్తున్నా చాలా మంది అవేమీ పట్టించుకోకుండా పీకలదాకా సేవించి ప్రాణాలపై తెచ్చుకుంటుంటారు. అలాంటి మద్యపాన ప్రేమికులకు శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు.

  • Publish Date - May 15, 2024 / 12:00 PM IST

లిక్కర్‌ ఎంత తీసుకున్నా కాలేయంపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఓ ప్రత్యేకమైన జెల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ జెల్‌కు ఇంటాక్సికెంట్‌ జెల్‌గా నామకరణం చేశారు. ఇది ఉదరంలోని పేగుల్లో ఓ పుతగా ఏర్పడి.. రక్షణ కవచంలా మారి లిక్కర్‌ ప్రభావం కాలేయంపై పడకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా, మద్యం సేవించినప్పుడు ఉదరంలోకి చేరి పేగుల్లోని మ్యూకస్ మెంబ్రేన్ పొర ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన మద్యం కాలేయాన్ని చేరుతుంది. అక్కడి హార్మోన్‌లతో కలిసి రసాయనిక చర్య జరిగి మద్యం కాస్తా ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్ అనే విషపదార్థంగా మారుతుంది. ఇది తక్కువ సమయంలోనే లివర్‌ను దెబ్బతీస్తుంది. స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఇంటాక్సికెంట్‌ జెల్‌ ఉదరంలో పేగుల్లో ఒక పొరలా ఏర్పడుతుంది. ఈ జెల్‌లోనే నానో ప్రొటీన్స్‌ ఉంటాయి. దాంతో జీర్ణం అయ్యేందుకు కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది.

మద్యం పేగుల్లోకి వచ్చి రక్తంలో కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. అలాగే, మద్యం పేగుల్లోకి రాగానే ఈ జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని రిలీజ్‌ చేస్తుంది. ఈ హైడ్రోజెన్ పెరాక్సైడ్ మద్యంతో రసాయన చర్య జరిగి.. ఎసిటిక్ యాసిడ్‌లా మార్చేస్తుంది. ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరినా దాని ప్రభావం పెద్దగా ప్రభావం ఉండదు. ప్రస్తుతం ఈ జెల్‌ను ఎలుకలపై ప్రయోగించగా.. విజయవంతమైంది. నానోజెల్‌లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్, వే ప్రొటీన్ నుంచి తయారయ్యే నానో ఫైబర్ అణువులు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ జెల్‌ని తయారుచేసిన శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించి రఫెల్ మెజెంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మద్యం తాగకుండా ఉండడమే మంచిదని ఆయన అన్నారు. మద్యం తాగలేకుండా ఉండలేని వారి కోసమే ఈ జెల్‌ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

Latest News