Hyderabad | మ‌ద్యం మ‌త్తులో గొడ‌వ‌.. పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు

Hyderabad | హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని బాలాపూర్‌( Balapur )లో బుధ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తులో చోటు చేసుకున్న గొడ‌వ‌.. హ‌త్యాయ‌త్నం దాకా దారి తీసింది.

Hyderabad | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని బాలాపూర్‌( Balapur )లో బుధ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తులో చోటు చేసుకున్న గొడ‌వ‌.. హ‌త్యాయ‌త్నం దాకా దారి తీసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బాలాపూర్‌కు చెందిన అబ్దుల్, జ‌హంగీర్ ఇద్ద‌రూ స్నేహితులు. ఇక వీరిద్ద‌రూ మ‌ద్యం సేవించేందుకు బాలాపూర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. బుధ‌వారం రాత్రి మ‌ద్యం సేవిస్తున్న క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో స‌హ‌నం కోల్పోయిన జహంగీర్ త‌న వ‌ద్ద ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకుని, అబ్దుల్‌పై పోశాడు. అనంతరం నిప్పంటించాడు. మంట‌ల ధాటికి త‌ట్టుకోలేని అబ్దుల్ సాయం కోసం అరిచాడు. అటుగా వెళ్తున్న వాహ‌న‌దారులు, స్థానికులు అబ్దుల్‌ను గ‌మ‌నించి.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జహంగీర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.