మద్యం పేరు చెబితే కొందరికి ఎక్కడా లేని సంతోషం వారి ముఖాల్లోకి వచ్చి చేరుతుంది. ఆనందం వచ్చినా.. బాధ ఎదురైనా, పెళ్లయినా.. చావైనా మందు తాగడం ప్రస్తుతం సాధారణమైపోయింది. సాయంత్రం 6 దాటిందంటే మద్యం ప్రియులకు పండగే.. ఇక పండుగ రోజైతే వారికి తిరుగే ఉండదు. అల్కహాల్ కు బానిసైనవారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వైన్స్ దగ్గరే ఉంటూ తెగ తాగేస్తుంటారు. చిన్నపార్టీ చేసుకున్నా అల్కహాల్ పొంగాల్సిందే. గొడవ, పంచాయతీ, ఎన్నికలు ఇలా ప్రతి సందర్భాల్లో మందుకు ఇచ్చే ప్రియారిటి అంతా ఇంతా కాదనేది అందరికీ తెలిసిందే.
దేవతలు సురాపానం తీసుకుంటారనేది వాడుకలో ఉండగా.. మద్యం సంస్కృతిలో భాగంగా మారింది. ఎలాంటి సమస్యలు అయినా మందు ముందు పెట్టుకుని కూర్చింటే పరిష్కారమవుతాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అల్కహాల్ లో చాలా రకాలు ఉంటాయి.. అందులో బ్రాందీ, విస్కీ, వైన్, బీర్, వోడ్కా, రమ్, జిన్, టెకిలా, సిడార్ ఇలా చాలా రకాలైన మద్యం ఉంటుది. అయితే, ఇవి ఏఏ పదార్థాలతో తయారు చేస్తారనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాడే పదార్థాలు, చేసే విధానం బట్టి వాటి రుచి, లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ఆల్కహాల్ వేటి నుంచి ఉత్పత్తి చేస్తారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
బ్రాండీ ఎలా తయారవుతుంది? బ్రాండీ ఫలాలను పులియబెట్టడ ద్వారా తయారు చేస్తారు. ఫలాల రసానికి కొన్ని పదార్థాలు కలపితే బ్రాండీ తయారవతుంది. ముఖ్యంగా ద్రాక్ష రసాన్ని కిణ్వన (Fermentation) ప్రక్రియ చేసి ఆపై డిస్టిల్ చేసి తయారు చేస్తారు. బ్రాండీకి ఫలాల రుచి ఎక్కువగా ఉంటుంది. 35శాతం నుంచి 60శాతం వరకు ఆల్కహాల్ కలిగి ఉంటుంది.
వైన్ తయారి ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ముందుగా ద్రాక్షలను నూరుతారు. వాటి నుంచి వచ్చిన రసానికి సహజ ఈస్ట్ కలిపి కిణ్వనం చేస్తారు. ఈ ప్రక్రియలో ఈస్ట్ ద్రవంలో ఉండే చక్కెరలను ఆల్కహాల్ గా మార్చడంలో ఉపయోగపడుతుంది. ద్రాక్ష రకంతో పాటు కిణ్వించే కాలం, తయారీ విధానం ఆధారంగా వైన్ టేస్ట్ మారుతూఉంటుంది. కాగా, సాధారణంగా వైన్‌లో 8 నుండి 15 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది.
బీర్ ఎలా తయారవుతుందంటే.. బీర్ తయారీలో ప్రధానంగా బార్లీ, గోధుమలు లేదా ఇతర ధాన్యాలు ఉపయోగిస్తారు. ముందుగా ఈ ధాన్యాలను నానబెట్టి మొలకలు వేస్తారు. ఆ తర్వాత వాటిని కిణ్వన ప్రక్రియకు పంపిస్తారు. ఇందులో ఉండే ఈస్ట్ చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తుంది. బీర్‌లో సాధారణంగా 4 శాతం నుంచి 8 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. హాప్‌లు, ధాన్య రకం, కిణ్వించే విధానం ఆధారంగా బీర్ రుచిలో మార్పులు ఉంటాయి.
విస్కీ కిణ్వించిన ధాన్యాల మిశ్రమం ద్వారానే ప్రారంభమవుతుంది. కాని దీనిని తరువాత డిస్టిల్ చేసి శుద్ధి చేస్తారు. డిస్టిల్ అయిన ద్రవాన్ని ఒక చెక్క పిపాలో సంవత్సరాల పాటు నిల్వ ఉంచి పరిపక్వం చెందేలా చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల విస్కీకి గాఢమైన, బలమైన ఫ్లేవర్ వస్తుంది. విస్కీలో ఆల్కహాల్ శాతం సాధారణంగా 40 నుంచి 60 శాతం వరకు ఉంటుంది.
జిన్ ప్రత్యేకత ఏమిటి అంటే.. జిన్ ప్రాధాన్యం దాని బోటానికల్స్ వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా జూనిపర్ బెర్రీలు, కొత్తిమీర, నిమ్మ తొక్కలు, ఇతర వనస్పతి పదార్థాలు వీటన్నింటిని కలిపి డిస్టిల్ చేస్తారు. అందుకే దీనికి తాజాదనం, ప్రత్యేక వాసన ఉంటుంది. జిన్‌లో ఆల్కహాల్ శాతం 35 నుంచి 50 వరకు ఉంటుంది.
వోడ్కా తయారయ్యే విధానం.. సాధారణంగా బంగాళదుంప, మక్కా లేదా ధాన్యాలు ఉపయోగించి వోడ్కాను తయారు చేస్తారు. దీన్ని పలు మార్లు డిస్టిల్ చేసి..ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన, పారదర్శకమైన ద్రవంగా తయారు చేస్తారు. వోడ్కాకు పెద్దగా రుచి ఉండకపోయినా వాసన ఉంటుంది. దీంట్లో 35 శాతం నుంచి 50 శాతం వరకు ఆల్కాహాల్ ఉంటుంది. ప్రతి అల్కహాల్ పానీయం వేర్వేరు ముడి పదార్థాలతో, ప్రత్యేక తయారీ ప్రక్రియలతో తయారవడం వల్ల వాటికి ప్రత్యేకమైన రుచి, లక్షణాలు కలిగి ఉంటాయి.
(disclamer-మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
Also Read- Jaldapara | ఈస్ట్ వీరప్పన్.. కరుడుగట్టిన వేటగాడి కథ తెలుసా?
TG | దేశంలో తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణాలో.. ఎక్కడంటే?
HILT policy leak| జీవోకు ముందే విపక్షాల చేతికి హిల్ట్ పాలసీ..లీక్ పై విజిలెన్స్ విచారణ!
