TG | దేశంలో తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణాలో.. ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 8, 9 వ తేదీల్లో నిర్వహించబోయే సదస్సులో దేశంలోనే మొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ, రెండో మెన్స్ ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కీలక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

విధాత, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 8, 9 వ తేదీల్లో నిర్వహించబోయే సదస్సులో దేశంలోనే మొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ, రెండో మెన్స్ ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణపై కీలక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఇతర దేశాలతో పాటు మనదేశంలోని ప్రముఖులు హాజరుకానున్నారు. పీఎం మోదీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలను రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. 3వేల మంది ప్రముఖులతో పాటు 2వేల మంది అతిథులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

గ్లోబల్ సమ్మిట్ వేదికగా పలు కీలక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించనున్నారు. ఇందులో భాగంగానే క్రీడా రంగానికి సంబంధించిన కీలక ముందడుగు పడింది. దేశంలో మొదటి మహిళ క్రికెట్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, ప్రపంచంలో హాంకాంగ్ తరువాత భారత్ రెండో మహిళ ఫుట్ బాల్ అకాడమీ ఇదే కావడం విశేషం. అలాగే, రెండో పురుష ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన ప్రకటన గ్లోబల్ సమ్మిట్‌లో వెలువడనుంది. వీటితో పాటు అంతర్జాతీయ చెస్ పోటీల నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

కాగా, గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే ప్రముఖుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గిఫ్ట్ బాక్సులను అందించనుంది. తెలంగాణ ప్రత్యేక వంటకాలను వారికి రుచిచూపించనుంది. సదస్సు ఏర్పాట్లను డిసెంబర్ 5 లోపు పూర్తి చేసి.. డ్రై రన్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అధికారులను ఆదేశించారు. దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా పూర్తి చేసి.. అంతర్జాతీయంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దీని కోసం అవకాశం ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ ను ఏర్పాటు చేసింది.

 

Latest News