విధాత: హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లో అమానుష ఘటన చోటు చేసుకున్నది. సన్ సిటీ పరిధిలోని క్రేయాన్స్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 6 నెలల బాలుడు మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. బాలుడికి జ్వరం రావడంతో సమీపలంలో ఉన్న క్రేయాన్స్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స చేసిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గడువు ముగిసిన మందులు ఇవ్వడం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని, నింధితులపై సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
