Gold, Silver Rates| పెరిగిన బంగారం ధర..స్థిరంగానే వెండి

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 550పెరిగి రూ.1,61,570వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 500పెరిగి రూ. 1,48,100వవద్ద నిలిచింది. కిలో వెండి ధర వరుసగా మూడవ రోజు కూడా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : బంగారం ధరలు రోజుకొక మార్పుకు లోనవుతుండగా.. వెండి మూడు రోజులుగా స్థిరంగా ఉండిపోయింది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 550పెరిగి రూ.1,61,570వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 500పెరిగి రూ. 1,48,100వద్ద నిలిచింది. కిలో వెండి ధర వరుసగా మూడవ రోజు కూడా స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

శుభకార్యాలతో పెరిగిన కొనుగోలు

బంగారం, వెండి ధరలలో అస్ధిరత కొనసాగుతున్నప్పటికి భారత మార్కెట్ లో శుభ కార్యాల సీజన్ కొనసాగుతుండటంతో కొనుగోలు సానుకూలంగా సాగుతుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ప్రభావం దేశీయంగా కొంత బంగారం, వెండి అధిక కొనుగోలుకు ఆటంకంగా మారాయి. అయితే తక్షణ అవసరాలను అనుసరించి పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు కావాల్సిన మేరకు ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో మునుముందు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest News