ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఎలా అంతమొందించారు?

ఫిబ్రవరి 28, 2026న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ‘Operation Epic Fury’–‘Lion’s Roar’ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి. ప్రణాళిక, సమయ మార్పు, వాడిన ఆయుధాలు, కుటుంబ సభ్యులు, హతమైన టాప్ కమాండర్లు, పూర్తి టైమ్‌లైన్ వివరాలు చదవండి.

Ayatollah Ali Khamenei image amid reports of targeted strike on his Tehran compound and killed

టెహ్రాన్‌లోని నివాస సముదాయంపై లక్ష్యిత దాడి నేపథ్యంలో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.

How Iran supreme Leader Ayatullah Ali Khamenei Killed?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి – ఎలా?

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ‘Operation Epic Fury’ మరియు ‘Lion’s Roar’ దాడిలో ఫిబ్రవరి 28, 2026న టెహ్రాన్‌లో ఖమేనీ హతం. 500కు పైగా లక్ష్యాలపై ఏకకాల దాడులు. టాప్ కమాండర్లు, కుటుంబ సభ్యులు మృతి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి.  ఈ ఆపరేషన్​ ఎలా జరిగింది?

 

అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ – ఇజ్రాయెల్​ ‘లయన్స్ రోర్’

హైదరాబాద్/టెహ్రాన్, మార్చి 2, 2026:
ఫిబ్రవరి 28, 2026 ఉదయం 10 గంటల సమయంలో టెహ్రాన్ నగరం ఒక్కసారిగా బాంబుల మోతతో ఉలిక్కిపడింది. నేడు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (86) మృతి చెందినట్లు ఇరాన్ రాష్ట్ర మీడియా అధికారికంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఖమేనీ మరణాన్ని ధృవీకరించారు.

ఈ దాడి అమెరికా కోడ్‌నేమ్ “Operation Epic Fury”, ఇజ్రాయెల్ కోడ్‌నేమ్ “Operation Lion’s Roar” పేర్లతో నెలలపాటు ప్రణాళికాబద్ధంగా, అత్యంత పకడ్బందీగా అమలు చేయబడింది.

ప్రణాళిక దశ: నెలలపాటు నిఘా & రాజకీయ సమన్వయం

దాడికి ముందు టెహ్రాన్‌లోని ‘బైత్ రహ్బరి’ — ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయ-నివాస సముదాయం ఉపగ్రహ చిత్రం.

2025 చివరి నుంచి అమెరికా–ఇజ్రాయెల్ మధ్య రహస్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతమవుతోందనే ఆందోళన, క్షిపణి సామర్థ్యాల విస్తరణ, ప్రాంతీయ ఉగ్రవాదానికి మద్దతు వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయి.

CIA, CENTCOM మరియు ఇజ్రాయెల్ మొసాద్ మధ్య సమన్వయం నెలలపాటు కొనసాగింది. ఉపగ్రహ పర్యవేక్షణ, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ద్వారా ఖమేనీ కదలికలు, సమావేశాల సమయాలు, భద్రతా ఏర్పాట్లు ట్రాక్ చేయబడ్డాయి. “అత్యంత అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థ(Highly Sophisticated Tracking System)ను” వినియోగించామని ట్రంప్ వెల్లడించారు.

ఇజ్రాయెల్ వైపు ‘Operation Lion’s Roar’, అమెరికా వైపు ‘Operation Epic Fury’ పేర్లతో దాడి దశల వారీగా ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, తరువాత నాయకత్వ సమావేశ సముదాయంపై కేంద్రీకృత దాడి చేయాలని నిర్ణయించారు.

దాడి సమయం మార్పు: రాత్రి నుంచి ఉదయం వరకు వ్యూహాత్మక షిఫ్ట్

మొదట దాడిని రాత్రి (PM) సమయంలో అమలు చేయాలని భావించినట్టు సమాచారం. సాధారణంగా రాత్రి వేళల్లోనే తొలి దెబ్బ ఇస్తారు. అయితే చివరి క్షణాల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడి సమయాన్ని మార్చారు. టెహ్రాన్‌లోని ఖమేనీ అధికార నివాసం, బైత్​–ఎ_రహ్బరీలో అధినేత, ఇతర అత్యన్నత నాయకులు ఉదయం సమావేశం కాబోతున్నారన పక్కా సమాచారంతోనే దాడి సమయంలో మార్పు జరిగింది. ఈ మార్పు ద్వారా అమెరికా–ఇజ్రాయెల్​ వ్యూహాత్మక విజయం సాధించారని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

దాడి అమలు: 500 లక్ష్యాలపై ఏకకాలంలో భీకర దాడి

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి అనంతరం ధ్వంసమైనట్లు కనిపిస్తున్న ‘బైత్ రహ్బరి’ సముదాయం — ఉపగ్రహ చిత్రం.

శనివారం నాడు ఇరాన్​పై జరిగిన భారీ దాడిలో అమెరికా (Operation Epic Fury) మరియు ఇజ్రాయెల్ (Operation Lion’s Roar / Roaring Lion) మధ్య పని విభజన చాలా స్పష్టంగా ఉంది. ఇది నెలల తరబడి జరిగిన రహస్య సమన్వయ ఫలితం. ఇరాన్ పరిపాలనను అంతం చేయడం, అణు-క్షిపణి ముప్పును తొలగించడం లక్ష్యంగా రెండు దేశాలు వేర్వేరు బాధ్యతలు తీసుకున్నాయి.

ఇజ్రాయెల్ బాధ్యతలు (ప్రధానంగా నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం)

ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ (IDF) ప్రధాన దాడి చేపట్టింది.

ఖమేనీ నివాస-కార్యాలయ సముదాయం ‘బైత్–ఎ–రహ్బరి’పై మొదటి, కీలక దాడి ఇజ్రాయెల్ జెట్లు చేపట్టాయి. ఈ ఇజ్రాయెల్ దాడివల్లే ఖమేనీ, అతని కుటుంబసభ్యులు, ఇతర అత్యున్నత నాయకులు హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ప్రధాని నెతన్యాహు అధికారికంగా చెప్పారు.

ఇరాన్ రాజకీయ, సైనిక నాయకులను నిర్మూలించడం ఇజ్రాయెల్ ప్రధాన బాధ్యత. ఉదాహరణకు:

ఇజ్రాయెల్ 200 ఫైటర్ జెట్లు (F-35, F-15, F-16) ఉపయోగించి 500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపింది. ఖమేనీ కాంపౌండ్‌పై మాత్రమే భారీ లక్షిత బాంబులు (దాదాపు 30 వేసారని సమాచారం). ఖమేనీ అధికార నివాసం చుట్టూ జనావాసాలు ఉన్నాయి కనుక, వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కేవలం ఒక్క అధినేత నివాసాన్ని మాత్రమే ధ్వంసం చేసారు.

ఇంటెలిజెన్స్ (మొసాద్) ద్వారా నాయకుల కదలికలు, సమావేశాలు నిరంతరం ట్రాక్ చేసి ఖచ్చితమైన సమయాన్ని నిర్ధారించారు. ఉదయం దాడి చేయాల్సిరావడం కూడా సంయుక్త దళాలకు కలిసివచ్చింది. రాత్రి బదులు ఉదయం దాడి చేయడం వారికి వ్యూహాత్మ విజయాన్ని కట్టబెట్టింది.

అమెరికా బాధ్యతలు (ప్రధానంగా యుద్ధ సదుపాయాలు & నియంత్రణాకేంద్రాలు)

అమెరికా (CENTCOM, Task Force Scorpion Strike) ప్రధానంగా ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్, క్షిపణి ప్రయోగకేంద్రాలు, నావికాదళాలు, గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది.

తోమహాక్ క్రూజ్ మిస్సైల్స్ (అమెరికా యుద్ధ నౌకలు, జలాంతర్గామ నుంచి), F-35C, F/A-18 జెట్ల నుంచి గగనతల క్షిపణులు, HIMARS రాకెట్ సిస్టమ్స్, LUCAS ఆత్మాహుతి డ్రోన్లు (మొదటిసారి వాడారు) వినియోగించారు.

అమెరికా నిఘా సంస్థ (CIA) అత్యంత ఖచ్చితత్వ–అధునాతన నిఘా వ్యవస్థలతో ఖమేనీ స్థానాన్ని గుర్తించి ఇజ్రాయెల్‌కు చేరవేసింది. ట్రంప్ “ఖమేనీ తప్పించుకోలేకపోయాడు” అని చెప్పారు.

ఇరాన్​ గగనతత రక్షణ వ్యవస్థను అమెరికా నిర్వీర్యం చేసి, ఇజ్రాయెల్ జెట్లకు మార్గం సుగమం చేసింది.

సంయుక్త ప్రణాళిక & సమన్వయం

నెలల తరబడి CIA, మోసాద్, CENTCOM(యూఎస్​ సెంట్రల్​ కమాండ్​) మధ్య రహస్య ప్రణాళికలు చోటు చేసుకున్నాయి.

ఇజ్రాయెల్ నాయకత్వ నిర్మూలనను (నాయకులను చంపడం)పై దృష్టి సారిస్తే,అమెరికా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (అణు, క్షిపణి, నావికాదళాలు) ధ్వంసం చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ ఇరాన్​ అధికార మార్పే లక్ష్యంగా ప్రకటించారు. ట్రంప్ “ఇరాన్ ప్రజలారా.. మీ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోండి” అన్నారు. నెతన్యాహు “అణు ముప్పు తొలగించాం” అన్నారు.

ఖమేనీ & ఇతర నేతల హతం

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో హతమైనట్లు నివేదికలు వెల్లడించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు సీనియర్ సైనిక, రాజకీయ నాయకులు.

ఖమేనీ తన కార్యాలయంలో ఉన్న సమయంలోనే దాడి జరిగినట్టు ఇరాన్​ జాతీయ మీడియా పేర్కొంది.

దాడిలో మృతి చెందిన ఇతర ప్రముఖులు:

ఇంకా సుమారు 30–40 మంది సీనియర్ IRGC కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు కూడా మృతి చెందినట్టు నివేదికలు చెబుతున్నాయి.

కుటుంబ సభ్యుల మృతి

ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా ప్రకారం ఖమేనీ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించినట్టు సమాచారం. ఈ దాడి ఖమేనీ నివాస సముదాయంలోనే జరిగింది. సాధారణంగా దాడులు రాత్రిపూటే జరుగుతాయనే ఆలోచనతో ఉన్న ఖమేనీ బృందం, ఊహించని రీతిలో జరిగిన మెరిపుదాడిలో అంతమైంది.

ప్రతిస్పందన & ప్రాంతీయ ఉద్రిక్తత

ఇరాన్ 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బేసులపై, ఇజ్రాయెల్ లక్ష్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులు ప్రారంభించింది. అమెరికా గుండెల్లో దాడి చేస్తామని ఇరాన్​ సైనిక నాయకత్వం తీవ్రంగా హెచ్చిరించింది. ప్రతిగా ట్రంప్​, అలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే, చరిత్రలె కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చూస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.  “ఇది ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం” అన్నారు. నెతన్యాహు “ఇరాన్ అణు ముప్పు తొలగించాం” అన్నారు.

ముందున్న పరిస్థితి

1989 నుంచి అధికారంలో ఉన్న ఖమేనీ మరణంతో ఇరాన్‌లో వారసత్వ సంక్షోభం తలెత్తింది. స్పష్టమైన వారసుడి ప్రకటన లేకపోవడం రాజకీయ అనిశ్చితిని పెంచుతోంది.

మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Latest News