విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్ రావు బాల్మూరిలకు “రాష్ట్ర మంత్రి హోదా” కల్పించింది. తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్ రావు బాల్మూర్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. వారికి మంత్రి హోదా వారి పదవీకాలం పాటు అమల్లో ఉండనుంది.
కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి వర్గీయులుగా ముద్రపడిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై కొనసాగిస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో ఎప్పటికప్పుడు క్రీయాశీలకంగా వ్యహరిస్తున్నారు. వారిద్దరికి మంత్రి పదవి హోదా కట్టబెట్టడం ద్వారా తన వర్గీయులతో పాటు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు దక్కుతాయని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించినట్లైందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.