రేపు అందె శ్రీ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రముఖ కవి , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందె శ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అంతిమ కార్యక్రమాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

విధాత, హైదరాబాద్ :

ప్రముఖ కవి , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందె శ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అంతిమ కార్యక్రమాన్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్​ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు. రేపు(మంగళవారం) NFC నగర్ వద్ద ఈ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అంత్యక్రియలకు హాజరై అందెశ్రీ పార్దీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు. అలాగే, అందెశ్రీ ఆప్తులు, అభిమానులతో కలిసి అంతిమ యాత్రలో సీఎం పాల్గొననున్నారు. తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన కవితావేత్త అందెశ్రీ మరణం రాష్ట్రానికి, సాహిత్యానికి తీరని లోటు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.