Pawan Kalyan| బ్యాటరీ సైకిల్ విద్యార్ధికి పవన్ కల్యాణ్ ఆర్థిక ప్రోత్సాహం

విధాత : తను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా నూతన ఆవిష్కరణ చేసి ప్రతిభ చాటిన ఇంటర్ విద్యార్థికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆర్థిక ప్రోత్సహాన్ని అందించడం వైరల్ గా మారింది. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ స్వయంగా బ్యాటరీ సైకిల్‌ను రూపొందించాడు. ఇంటి నుండి దూరంగా ఉన్న కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందులు పడేవాడు. దీంతో తన ఆలోచనలను పదును పెట్టి, మూడు గంటలు ఛార్జ్‌తో 80 కిలోమీటర్లు వెళ్ళే బ్యాటరీ సైకిల్‌ను రూపొందించాడు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ రాజాపు సిద్దూను మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు పిలిపించుకుని..అతని ప్రతిభను మెచ్చుకొని రూ.1 లక్ష ప్రోత్సాహకం అందజేశారు. అతనితో కలిసి బ్యాటరీ సైకిల్ పై ప్రయాణించారు. విద్యార్థులకు పరిశోధనలు..నూతన ఆవిష్కరణలో రాజాపూ సిద్దూ ఆదర్శనీయమని అభినందించారు. అతను భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు.