పర్సనల్ లోన్ తీసుకొని చెల్లించకపోతే ఏం జరుగుతోంది? ఎన్ని రోజుల వరకు లోన్ చెల్లించకుండా వెసులుబాటు ఉంది? పర్సనల్ లోన్ ఎగవేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందా? ఏమైనా శిక్షలు పడుతోందా? సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుందా? రిజర్వ్ బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ కు సంబంధించి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి. ఒక్క నెల ఈఎంఐ చెల్లించకపోయినా బ్యాంకు సిబ్బంది గుర్తు చేస్తారు. ఆలస్యంగా ఈఎంఐలు చెల్లిస్తే దాని ప్రభావం లోన్ తీసుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోరుపైనే పడుతుంది. 15 రోజులకు ఒక్కసారి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి బ్యాంకులు నివేదికను పంపుతాయి. ఒక్క నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకు సిబ్బంది గుర్తు చేస్తారు. మూడు నుంచి ఆరు నెలల వరకు లోన్లు చెల్లించకపోతే రికవరీ ఏజెన్సీలకి అప్పగిస్తాయి. మరోవైపు లోన్లు చెల్లించాలని లీగల్ నోటీసులు కూడా పంపుతాయి బ్యాంకులు. అప్పటికి కూడా స్పందించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతారు. అంటే కేసు పెడతారు.
పర్సనల్ లోన్ చెల్లించడానికి మీకు ఎదురైన ఆర్ధిక ఇబ్బందులను బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. మారటోరియం కింద తాత్కాలిక రిలీఫ్ అడగవచ్చు లేదా లోన్ ను రీ స్ట్రక్చర్ చేయాలని కోరే అవకాశం కూడా ఉంది. లేదా ఎప్పటి నుంచి మీరు ఈఎంఐ చెల్లించగలరో బ్యాంకు అధికారులను వివరించి వడ్డీ తగ్గించే వెసులుబాటు ఏమైనా ఉంటే అడగవచ్చు. లేదా లోన్ కాలపరిమితిని పెంచుకొంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. లోన్ కాలపరిమితిని కూడా పెంచుకోవచ్చు.
లోన్ చెల్లించలేదనే కారణంగా బ్యాంకులు కేసు నమోదు చేసే వరకు పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మీ ఆదాయం నుండి లోన్ ను రికవరీ చేయాలని కోర్టులు ఆదేశించే అవకాశాలు కూడా లేకపోలేదు. కోర్టు ఆదేశాల మేరకు లోన్ ను చెల్లించకపోతే అప్పుడు జైలు శిక్ష అంశాన్ని కోర్టు పరిశీలించే ఛాన్స్ ఉంటుంది.